పార్టీ మారుతారన్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు.
పార్టీ మారే ఆలోచన తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి తన భార్య కోదాడ నుంచి పోటీలో ఉండనున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
తాము హస్తం పార్టీలోనే కొనసాగుతామని, తమ జీవితం హుజూర్ నగర్, కోదాడ ప్రజలకు సేవ చేయడానికే అంకితమని వెల్లడించారు.అయితే తాను పార్టీ మారుతానంటూ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
.






