తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్( TDP Nara Lokesh ) తన “యువగళం” పాదయాత్ర రాయలసీమలో పూర్తి చేసుకుని పల్నాడు ప్రకాశం గుంటూరు మీదగా విజయవాడలో అడుగుపెట్టబోతున్నారు.దాంతో ఒక్కసారిగా బెజవాడ రాజకీయం వేడెక్కబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణాజిల్లాలో గత 2019 ఎన్నికలలో వైసీపీ విజయకేతనం ఎగుర వేసింది.ఇక్కడ ఉన్న 16 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 14 సీట్లు గెలుచుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది కేవలం రెండు స్థానాలను మాత్రమే టిడిపికి వదిలిపెట్టింది దీంతో ఎలాగైనా సరే ఈ జిల్లాలో పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని కృత నిశ్చయం తో తన పాదయాత్ర ను ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది .అంతేకాకుండా తమ పార్టీ గుర్తుపై గెలిచి వైసిపి వైపు షిఫ్ట్ అయిన వల్లభనేని వంశీ( Vallabhaneni amsi )కి ఈసారి జలక్ ఇవ్వాలని ఆలోచిస్తున్న తెలుగుదేశం గన్నవరంలో లక్ష మంది తో భారీ ఎత్తున బహిరంగ సభను ప్లాన్ చేసుకుంటుంది.

అయితే అధికారపక్షం నుంచి కూడా ఈ యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra )కు కౌంటర్లు పడుతున్నాయి లోకేష్ విజయవాడ అంతా తిరిగి విజయవాడలో జరిగిన అభివృద్ధి తో సెల్ఫీలు తీసుకుంటే బాగుంటుందంటూ వైసీపీ విజయవాడ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేసినందుకు లోకేష్ క్షమాపణలు చెప్పి విజయవాడలో అడుగు పెట్టాలంటూ వైసీపీ సెంట్రల్ అభ్యర్థి మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.మరోపక్క విజయవాడ ఈస్ట్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampalli Srinivas ) కూడా లోకేష్ తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానంటూ ప్రకటించారు.దీంతో అధికార ప్రతిపక్ష నేతల సవాళ్లతో విజయవాడ రాజకీయం హీటెక్కిపోతున్నట్లుగా తెలుస్తుంది అధికార వైసిపి కూడా కృష్ణాజిల్లాలో 2019 నాటి పలితాలను వచ్చే ఎన్నికల్లో రిపీట్ చేయాలని భావిస్తున్నందున జగన్ పూర్తిస్థాయిలో ఈ జిల్లా పై ఫోకస్ పెట్టారు.
ఏ జిల్లాకి లేనట్టుగా ఇప్పటికే ఇక్కడ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించడం వైసిపి ఈ జిల్లాకి ఎంత ప్రాముఖ్యతని ఇస్తుందో తెలుసుకోవచ్చు.

తమ సభలకు అడ్డంకులు సృష్టించడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తుందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తుంటే అసలు ఏ ప్రాముఖ్యత లేని ఎవరూ పట్టించుకోని లోకేష్ యాత్ర( Lokesh Padayatra )కు మేమెందుకు అడ్డుకోవాలని అనుకుంటామని, అది పాదయాత్ర లాగా లేదని ఈవినింగ్ వాక్ లా ఉందంటూ అధికార పార్టీ సెటైర్ లు పేలుస్తుంది .మరి ఆరు రోజుల పాటు ఈ జిల్లా లో జరగబోయే యువగలం పాదయాత్ర ఎన్ని సంచలనాలకు వేదికగా మారనుందో చూడాలి
.







