టీ కాంగ్రెస్ లో చీలిక తెస్తున్న షర్మిల?

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె కాంగ్రెస్లోకి చేరికపై గత కొన్ని రోజులుగా వరుస కథనాలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే .రెండుసార్లు కాంగ్రెస్( Congress ) కేంద్రంలో అధికారం చేలాయించడానికి ముఖ్య భూమిక వహించిన రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి కూడా ఒకటి అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణలో కూడా బలమైన శిష్య వర్గం ఉంది.

 Sharmila Bringing A Split In T- Congress?,t Congress,telangana Politics,ysrtp S-TeluguStop.com

కోమటిరెడ్డి బ్రదర్స్, కొండా సురేఖ దంపతులు, జగ్గారెడ్డి,సబితా ఇన్ద్ర రెడ్డి వంటి వారు రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి కి వీర విధేయులుగా ఉండేవారు.

Telugu Congress, Delhi, Revanth Reddy, Telangana, Ys Sharmila, Ysrtp Sharmila-Te

అయితే వైయస్ మరణం, తెలంగాణ ఏర్పాటు వంటి పరిణామాలు జరిగిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి వలస వచ్చిన నేతలతో నిండిపోయింది.ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చంద్రబాబు అనుచరుడిగా పేరుపొందారు.ఇప్పటికీ ఆయన తెలుగుదేశం అనుకూల వైఖరితోనే ఉన్నారు అంటారు .ఇప్పుడు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో( Telangana Politics ) అడుగుపేడితే వైయస్ వర్గం మరొకసారి బలపడి గ్రూపు తగాదాలు ఏర్పడతాయన్న అనుమానాలతోనే రేవంత్ వర్గం షర్మిల రాజకీయ ప్రయాణాన్ని వ్యతిరేకిస్తుందంటారు.అయితే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సీనియర్ నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమకుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వారు షర్మిల( YS Sharmila ) రాకను స్వాగతిస్తున్నారు.

Telugu Congress, Delhi, Revanth Reddy, Telangana, Ys Sharmila, Ysrtp Sharmila-Te

ఆమె రాక ద్వారా వైఎస్ వర్గం తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో పట్టు చిక్కించుకోవచ్చు అని ఆలోచనతో వారు ఉన్నారని, అందువల్ల అధిష్టానం పై ఒత్తిడి తీసుకువచ్చి మరీ షర్మిల కాంగ్రెస్ ప్రయాణానికి వీరు సహకరిస్తున్నారు అన్నది రేవంత్ రెడ్డి వర్గం అనుమానంగా ఉన్నదని వార్తలు వస్తున్నాయి .ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది.మరి తాను అడుగుపెట్టకుండానే కాంగ్రెస్ను రెండుగా ఛీలుస్తున్న షర్మిల మరి ఒక్కసారి తెలంగాణ కాంగ్రెస్ లో అడుగుపెడితే మరిన్ని గ్రూపు తగాదాలకు వేదికగా మారుతుందా అన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube