సూర్యకాంతం( Suryakantham ) గయ్యాళి అత్తగా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.1946 నుంచి 1994 వరకు ఆమె ఎన్నో సినిమాల్లో నటించి సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణా, రంగస్థల శిరోమణి వంటి గొప్ప బిరుదులను దక్కించుకుంది.మాయాబజార్,( Mayabazaar ) గుండమ్మ కథ,( Gundammakatha ) చదువుకున్న అమ్మాయిలు, ఆత్మగౌరవం, దసరా బుల్లోడు వంటి చాలా హిట్ సినిమాల్లో ఆమె అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
సూర్యకాంతం 1926లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించింది.
ఆమె 1940ల ప్రారంభంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.ఆమె తక్కువ సమయంలోనే తెలుగు సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా మారింది.
సూర్యకాంతం మొదటగా జెమిని స్టూడియోస్ నిర్మాణంలో వచ్చిన చంద్రలేఖలో( Chandralekha ) డ్యాన్సర్‌గా కనిపించింది.డ్యాన్సర్‌గా నటించినందుకు ఆ రోజుల్లోనే ఆమెకు 75 రూపాయలు పారితోషికం ఇచ్చారు.
సూర్యకాంతం లేకుండా అప్పట్లో దిగ్గజ దర్శకులైన బి.నాగిరెడ్డి, చక్రపాణి సినిమా చేసే వారే కాదు.N.T.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, S.V నటించిన గుండమ్మ కథ చిత్రాన్ని నాగిరెడ్డి,( B Nagireddy ) చక్రపాణి( Chakrapani ) నిర్మించారు.అందులో సూర్యకాంతం ప్రధాన పాత్ర అయిన గుండమ్మగా నటించి ఎంతో మెప్పించింది.ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది.ఇంతటి గొప్ప నటి గురించి ఈ తరం వారికి తెలిసింది కొంచమేనని చెప్పవచ్చు.
ఆమె గురించి సీనియర్ టాలీవుడ్ యాక్టర్ తనికెళ్ల భరణి( Tanikella Bharani ) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఓ ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణి మాట్లాడుతూ.“సూర్యకాంతం 300 సినిమాలు చేసింది.అన్నిటిలో ఒకటే పాత్ర చేసింది.ప్రపంచ సినిమా చరిత్రలో ఒకే స్వభావంగా అన్ని వేషాలు వేసి, అన్నీ సూపర్ హిట్ చేసి, అన్నిటిలో ఎడమ చేతితోనే మేనరిజం చూపించి మెప్పించిన మహానటి సూర్యకాంతం.” అని అన్నారు.తనికెళ్ల భరణి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సహజ నటి సూర్యకాంతానికి సాటి ఎవరూ లేరని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.