గత కొద్ది రోజులుగా భారతదేశంలో టమాటాల ధరలు( Tomato Price ) మండుతున్నాయి.వీటి పుణ్యమా అని రైతులు కోటీశ్వరుడు కూడా అయ్యారు.
ఆ విధంగా అనూహ్యంగా టమాటాలు బంగారం అయిపోయాయి.వీటిని ఫ్రీగా ఇస్తామని చెబుతూ కొందరు బిజినెస్ కూడా పెంచుకుంటున్నారు.
తాజాగా టమాటాలను మద్యం కోసం ఎక్స్ఛేంజ్ చేయడం కూడా ప్రారంభించారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆరేడు టమాటాలు ఇస్తే లిక్కర్ బాటిల్ ఇవ్వడం కనిపించింది.

వీడియోలో, ఒక వ్యక్తి వైన్ షాప్‌లోకి టమాటాలను తీసుకువెళ్తాడు.మద్యం కోసం వాటిని మార్పిడి చేయాలని అడుగుతాడు.వైన్ షాప్ వ్యక్తి మొదట ఆశ్చర్యపోతాడు, కానీ టమాటాలకు ఉన్న డిమాండ్ పరిగణలోకి తీసుకొని మద్యం బాటిల్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు.దాంతో సదరు కస్టమర్ సింపుల్ గా మద్యం( Liquor ) కోసం టమాటాలను మార్చుకుంటాడు.
తర్వాత నవ్వుతూ వెళ్లిపోతాడు.
టమాటాలకు ఉన్న డిమాండ్ ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించే ఈ వీడియో అప్‌లోడ్ అయిన కొంతసేపటికే సోషల్ మీడియాలో వైరల్( Social media ) అయింది, ఇప్పటివరకు దానిని మిలియన్ల మంది చూశారు.
ఈ వీడియో టమాటాల ధరలు ఎంత భారీగా పెరిగాయో, టమాటాలు ఎంత పాపులారిటీ పొందిన వస్తువుగా మారాయో చూపిస్తుంది.

వీడియోపై కూడా చాలా ఫన్నీ కామెంట్లు వచ్చాయి.కొంతమంది టమాటాలు ఇప్పుడు భారతదేశంలో కొత్త కరెన్సీ అని చెప్పారు, మరికొందరు డాలర్‌కు పోటీగా టమాటాలను కొత్త కరెన్సీగా ప్రకటించాలని సరదాగా కామెంట్స్ చేశారు.ఇంకొందరు ఆర్బీఐ( RBI ) టమాటాలను నిల్వ చేసి కొత్త కరెన్సీని ముద్రించాలని చెప్పారు.
ఇక టమాటాల ధరలు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి.








