రాజన్న సిరిసిల్ల జిల్లా : ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోటో కెమెరా ఆవిష్కరించిన లూయిస్ డాగిరే యొక్క జ్ఞాపకార్థం ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటారని పేర్కొన్నారు.ఫోటోగ్రఫీ రంగంలో ఫోటో కెమెరా అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఎన్నో మార్పులు చెందిందన్నారు.
టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ తమ వృత్తిని కొనసాగించాలని సూచించారు.ఇప్పుడున్న పరిస్థితులలో ఫోటో వీడియో గ్రాఫర్స్ స్టూడియో వారు చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు.
డిజిటలైజేషన్ అయిన తర్వాత ఫోటోగ్రఫీలో చాలా మార్పులు వచ్చాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఫోటో వీడియో గ్రాఫర్స్ ని బ్యాంక్ రుణాల ద్వారా ఆర్థిక సాయం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఫోటో వీడియో గ్రాఫర్స్ ల కొరకు కుటుంబ భరోసా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు.ఫోటోగ్రాఫర్ ప్రమాదవశాస్తూ మరణించిన వారి కుటుంబానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఫోటోగ్రాఫర్ కుటుంబ భరోసా సభ్యులు ఒక్కొక్కరు పది రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ ఒక కుటుంబానికి లక్ష ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుందని ఇప్పటివరకు రాష్ట్రంలో 65 మంది ఫోటోగ్రాఫర్లు కాలం చేశారని వారి కుటుంబాలకు రాష్ట్ర ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై వేల చొప్పున అందజేయడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫోటో వీడియో గ్రాఫర్స్ కి ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పాలోజీ శ్రీనివాస్ చారి,ప్రధాన కార్యదర్శి మారోజు కుబేర్ స్వామి, కోశాధికారి మహమ్మద్ షాదుల్, మహమ్మద్ ఫక్రుద్దీన్,మారోజు నరసింహ చారి, మమ్మద్ అజ్జు,పెంజర్ల తిరుపతి యాదవ్, పాలోజి శంకర్ చారి ,శ్యామ్, శ్యామంతుల అనిల్ పాల్గొన్నారు.