ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.జనాలు ఈ రీ రిలీజ్ చిత్రాలను బాగా ఆదరిస్తుండడంతో బయ్యర్స్ కూడా ఈ ట్రెండ్ కి బాగా అలవాటు పడ్డారు.
సినిమాలు ఏమి లేని సమయం లో ఈ రీ రిలీజ్ చిత్రాల ద్వారా వచ్చే కలెక్షన్స్ తోనే థియేటర్స్ నడుస్తున్నాయి.ఎన్ని రీ రిలీజ్ చిత్రాలు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మరియు మహేష్ బాబు చిత్రాలే ఎక్కువగా ప్రేక్షాధారణ పొందాయి.
వీళ్లిద్దరి సినిమాలకు అత్యధిక రికార్డ్స్ ఉన్నాయి.ఖుషి , పోకిరి , జల్సా, బిజినెస్ మేన్ వంటి చిత్రాలు ఇండస్ట్రీ లో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పాయి.
మధ్యలో మూడవ పార్టీ వారు విడుదల చేసిన తొలిప్రేమ, ఒక్కడు వంటి చిత్రాలు కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.అలా రీ రిలీజ్ లో వీళ్లిద్దరి హవానే బలంగా నడుస్తుంది.

అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 31 వ తారీఖున ‘గుడుంబా శంకర్’ ( Gudumba Shankar )చిత్రాన్ని 4K కి మార్చి రీ రిలీజ్ చెయ్యబోతున్నటుగా ఆ చిత్ర నిర్మాత నాగబాబు గత రెండు రోజుల క్రితమే ఒక ప్రకటన చేసాడు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీ అయితే , రెండు రోజుల ముందు ప్రదర్శిస్తున్నారు దేనికి అంటూ కామెంట్స్ వినిపించాయి.సెప్టెంబర్ 1 వ తేదీన విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ( kushi )చిత్రం విడుదల అవ్వబోతుండడం వల్ల, థియేటర్స్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున రెండు రోజుల ముందే రిలీజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.అయితే ఏమైందో ఏమో సరైన కారణం తెలియదు కానీ, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2 వ తేదికి వాయిదా వేస్తున్నట్టుగా కాసేపటి క్రితమే ట్రైలర్ ని విడుదల చేస్తూ చెప్పుకొచ్చాడు నాగబాబు.
దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా మండిపడ్డారు.

ఆగస్టు 31 వ తేదీన విడుదల చేస్తున్నామని చెప్పి, ఇలా వెంటనే డేట్ మార్చేయడం ఏమిటి అని మండిపడ్డారు.సెప్టెంబర్ 2 వ తేదీన కొత్త సినిమాలు విడుదల అయ్యినప్పటికీ థియేటర్స్ కొరత లేకుండా చూసుకుంటామని, అందులో ఎలాంటి సందేహం వద్దని చెప్పుకొస్తున్నారు గుడుంబా శంకర్ మూవీ టీం సభ్యులు.సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ టీజర్ విడుదల అవుతుంది.
ఆ టీజర్ ని ఈ సినిమాకి అటాచ్ చేసి వదిలితే ఇంకా ఎక్కువ వసూళ్లు వస్తాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకొస్తున్నారు.పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ గా తెరకెక్కే ఓజీ మూవీ టీజర్ ని వెండితెర మీద చూసే అదృష్టం కలిగితే అభిమానులకు కూడా సంతోషమే, కానీ కొత్త సినిమాల విడుదల వల్ల షోస్ దొరుకుతాయో లేవో, రికార్డు పెడుతామో లేదో అనే భయం తో ఉన్నారు ఫ్యాన్స్.








