టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది.ఇప్పటివరకు 2,496 కిలోమీటర్ల మేర సాగిన లోకేశ్ పాదయాత్ర 2500 మైలురాయికి చేరనుంది.
ఈ క్రమంలోనే ప్రకాశం బ్యారేజ్ మీదుగా కృష్ణా జిల్లాలోకి లోకేశ్ పాదయాత్ర అడుగుపెట్టనుంది.ఈ నేపథ్యంలో జిల్లా టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.
అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పాదయాత్ర ముగియనుండగా వీడ్కోలు పలికేందుకు నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివస్తున్నారు.ఇటు కృష్ణా జిల్లా నేతలు ఘనంగా స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నారా లోకేశ్ పాదయాత్ర టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుందనే చెప్పుకోవచ్చు.