రాహుల్ గెలుపుపై.. కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ ?

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ఎంత పట్టుదలగా ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఎప్పుడు తమదే పైచేయి ఉండాలని భావించే హస్తం నేతలు గెలుపు కోసం ఒక మెట్టుదిగి విపక్షాలతో చేతులు కలిపింది.

 Congress Confidence On Rahul's Victory, Rahul Gandhi, Congress Party , Bjp Part-TeluguStop.com

ఎలాగైనా మోడిని గద్దె దించి ఈసారి ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుఃతోంది.మరి రాహుల్ గాంధీ మోడీని ( Narendra Modi )ఢీ కొట్టి నిలవగలరా ? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.గతంలో రాహుల్ గాంధీలో రాజకీయ పరిణితి లేదనే విమర్శలు గట్టిగా వినిపించాయి.

Telugu Bjp, Congress, Narendra Modi, Rahul Gandhi, Smriti Irani-Politics

కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రభావవంతమైన నేతగా ఎదుగుతున్నారు.ఆయనపై వచ్చిన విమర్శలన్నిటిని పటాపంచలు చేసేలా దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.కాంగ్రెస్ కు పునర్జీవం తెచ్చేలా ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు ఊపిరినిచ్చింది.

యాత్ర ప్రభావంతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.దాంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ మేనియా సాగడం గ్యారెంటీ అని కాంగ్రెస్ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయన పోటీ చేసే స్థానంపై అందరి దృష్టి నెలకొంది.గత ఎన్నికల్లో ఆయన రెండు అమేఠీ మరియు వయోనాడ్ నుంచి పోటీ చేశారు.

Telugu Bjp, Congress, Narendra Modi, Rahul Gandhi, Smriti Irani-Politics

అయితే వయోనాడ్ లో గెలుపొందగ్తా ఆమెఠీలో మాత్రం ఓటమి చవిచూశారు.ప్రత్యర్థి పార్టీ బీజేపీ ( BJP party )కి చెందిన స్మృతి ఇరానీ Smriti Irani )చేతిలో 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారయన.దాంతో ఈసారి ఎక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది.కాగా రాహుల్ గాంధీ మళ్ళీ ఆమెఠీ నుంచే పోటీ చేస్తారని యుపిసిసి చీఫ్ అజయ్ రాయ్ తాజాగా ప్రకటించారు.

దీంతో ఎక్కడైతే రాహుల్ గాంధీ ఓటమి చవి చూశారో అక్కడే గెలిచి నిలవాలని ఆయన డిసైడ్ తెలుస్తోంది.అయితే కేవలం ఆమెఠీ నుంచి మాత్రమే పోటీ చేస్తారా లేదా గత ఎన్నికల్లో మాదిరి రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతారా అనేది మాత్రం స్పష్టత లేదు.

కాగా ఈసారి మాత్రం రాహుల్ గాంధీ తాను పోటీ చేసే స్థానంలో గెలవడంతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ ను కూడా అధికారంలోకి తీసుకొస్తారని కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్ గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube