మంత్రి రోజా కూతురి గురించి అలాంటి కామెంట్లు.. ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందంటూ?

వైసీపీ మంత్రి రోజా కూతురు అన్షుమాలిక( YCP MLA Daughter Anshu Malika ) మంచి మనస్సు గురించి గతంలో ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.తన ప్రతిభతో అన్షుమాలిక అరుదైన ఘనతలను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు.

 Trolls About Roja Daughter Details Here Goes Viral In Social Media,roja Daughte-TeluguStop.com

అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.సోషల్ మీడియాలో మాత్రం అన్షుమాలిక యాక్టివ్ గా ఉంటూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

Telugu Anshu Malika, Ap, Roja, Trolls, Ycp-Movie

తాజాగా అన్షుమాలిక ఇన్ స్టాగ్రామ్ వేదిక( Anshumalika Instagram )గా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.అయితే వైసీపీ మంత్రి రోజాపై ఉన్న కోపం, ద్వేషం వల్ల కొంతమంది అన్షుమాలికను టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం.అన్షుమాలికకు ఇన్ స్టాగ్రామ్ లో లక్ష కంటే ఎక్కువగా ఫాలోవర్లు ఉన్నారు.మంత్రి కూతురు( Minister Daughter ) అయినా అన్షుమాలిక రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.

అయితే అన్షుమాలిక ఫోటోల గురించి ఎక్కువమంది పాజిటివ్ కామెంట్లు చేయగా కొంతమంది మాత్రం ఎవరి సొమ్ముతో? అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.మీ మమ్మీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్( AP Development ) చేయమని చెప్పు అంటూ మరి కొందరు కామెంట్లు చేశారు.

మరి కొందరు మాత్రం రాయడానికి కూడా ఇబ్బంది పడే భాషలో సెటైరికల్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Anshu Malika, Ap, Roja, Trolls, Ycp-Movie

అన్షుమాలిక మాత్రం పాజిటివ్ కామెంట్ల గురించి రియాక్ట్ అవుతూ నెగిటివ్ కామెంట్ల( Negative Comments ) విషయంలో సైలెంట్ గా ఉంటున్నారు.అన్షుమాలిక కెరీర్ పరంగా సక్సెస్ సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని రోజా అభిమానులు కోరుకుంటున్నారు.రోజాపై కోపం ఉంటే కూతురిని టార్గెట్ చేసి ట్రోల్స్( Trolls ) చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అన్షుమాలికకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.అన్షుమాలికను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube