రెండు తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటలని, ఇక్కడ కూడా బలమైన పార్టీగా రూపాంతరం చెండాలని బీజేపీ( BJP ) ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.కానీ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదు.
తెలంగాణలో కొంత మెరుగ్గానే ఉన్నప్పటికి.ఏపీలో కమలం పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
ప్రస్తుతం ఇక్కడ జనసేన పార్టీ( Jana sena ) పొత్తులో లేకపోతే బీజేపీ రేస్ లో ఉందనే విషయం కూడా చెప్పడం కష్టమే.అందుకే ఏపీలో ఎలాగైనా బలపడాలని కాషాయ పెద్దలు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.
అందుకే వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టింది కాషాయ పార్టీ హైకమాండ్.అందులో భాగంగానే సోము వీర్రాజు ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి పురందేశ్వరికి ఆ బాద్యతలు అప్పటించింది.
ప్రస్తుతం పురందేశ్వరి( Daggubati Purandeswari ) పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషి చేస్తున్నారు.ఇంకా ఏపీ బీజేపీకి మరింత బలం చేకూర్చేందుకు సరికొత్త ప్రణాళికలు వేస్తున్నారు బీజేపీ పెద్దలు.అందుకోసం బండి సంజయ్ ని ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చేలా పావులు కడుపుతోంది అధిష్టానం.గతంలో తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా కొనసాగిన బండి సంజయ్ అక్కడ పార్టీ బలోపేతంలో ముఖ్య పాత్ర పోషించారు.
ఆ తరువాత ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించి అంతకు మించి అనేలా ఏకంగా బీజేపీ జాతీయ కార్యదర్శి పదవినే బండికి కట్టబెట్టింది అధిస్థానం, ప్రస్తుతం బండి సంజయ్( Bandi Sanjay Kumar ) సేవలను ఏపీలో వినియోగించుకునే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది.ఈ నెల 21 న బండి సంజయ్ ఏపీలో పర్యటించనున్నారు.
పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో ఏపీలో పార్టీ పరిస్థితులపై సమీక్ష జరపనున్నారు బండి సంజయ్.దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.గతంలో ఏపీపై పలుమార్లు వ్యంగ్యస్త్రాలు సంధించారు బండి సంజయ్.ఇప్పుడు ఏపీ పర్యటనలో ఆయన ఎలాంటి కామెంట్స్ చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.అంతేకాకుండా జనసేన పొత్తు విషయంలో కూడా గతంలో భిన్నంగా స్పందించారు బండి సంజయ్.మరి ఇప్పుడు పొత్తుపై ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది.
అసలు ఏపీ రాజకీయాల్లో బండి సంజయ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేవి ఆసక్తికరమైన అంశాలు.మొత్తానికి ఏపీ విషయంలో బండి సంజయ్ ని రంగంలోకి దించి బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసినట్లే తెలుస్తోంది.
మరి ఈ ప్రణాళికలు ఎంతవరుకు వర్కౌట్ అవుతాయో చూడాలి.