తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీసీలను అణిచివేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఉన్న ముగ్గురు బీసీ మంత్రులపై కోవర్టు ఆపరేషన్ చేస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి బీసీలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
తమ జాతులను కించపరిచేలా మాట్లాడితే రాజకీయంగా అణగదొక్కుతామని చెప్పారు.తమ వృత్తులను అపహేళన చేసిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
ఇకనైనా బీసీలను అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.







