హైదరాబాద్ లోని లోటస్ పాండ్ దగ్గర వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల దీక్షకు దిగారు.ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉండగా పోలీసులు అడ్డుకున్నారు.
దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైఎస్ షర్మిల తీగుల్ లో ఇటీవల నిరసన చేసిన బాధితులను కలిసేందుకు వెళ్తేందుకు ప్రయత్నించారు.అయితే షర్మల పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు లోటస్ పాండ్ లో భారీగా మోహరించారు.
ఈ క్రమంలోనే షర్మిలను వెళ్లనీయకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు.
దీంతో పోలీసుల తీరుపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రజల తరపున నిలబడిన తమను అడ్డుకోవడం సరికాదన్నారు.పోలీసులు కేసీఆర్ కు తొత్తులుగా పని చేయడం మానేసి ప్రజల కోసం పని చేయాలని తెలిపారు.
గజ్వేల్ లో దళితబంధు పథకం సరిగా అమలు కావడం లేదని ప్రజలు వాపోతుంటే కేసీఆర్ ఎక్కడనున్నారో చెప్పాలన్నారు.ప్రజా సమస్యలపై కేసీఆర్ స్పందించరా అని ప్రశ్నించారు.