మామూలుగా సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో ఎప్పుడు ఏ హీరోయిన్ ఫామ్ లోకి వస్తుందో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం.హీరోయిన్లు నటించిన సినిమాలు వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి అంటే చాలు వెంటనే ఆ హీరోయిన్ ను గోల్డెన్ అంటూ తెగ పొగిడేస్తూ ఉంటారు.
దర్శక నిర్మాతలు కూడా అలాంటి హీరోయిన్ ల వైపే ముగ్గు చూపుతుంటారు.అలా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో అగ్రస్థాయిలో రాణిస్తోంది హీరోయిన్ శ్రీ లీల.
ఈ ముద్దుగుమ్మ నటించినది కేవలం రెండు సినిమాలే అయినప్పటికీ ప్రస్తుతం ఈమె చేతిలో పది సినిమాలు ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అగ్ర హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సరసన నటించే అవకాశాలను సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతోంది.ఇది ఇలా ఉంటే ఇప్పుడు హీరోయిన్స్ స్త్రీలకు గట్టి పోటీని ఇవ్వడానికి ఈ సిద్ధంగా ఉంది హీరోయిన్ నేహా శెట్టి( Neha Sehetty) . మొదట మెహబూబా గల్లీ రౌడీ లాంటి సినిమాలలో నటించగా ఆ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.తర్వాత విడుదలైన డీజే టిల్లు సినిమా నేహా శెట్టి జాతకాన్ని మార్చేసింది.
డీజే టిల్లు తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఈమె బెదురులంక 2012, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలను సొంతం చేసుకుంది.
చిన్న సినిమాలే అని నిరాశ పడకుండా వచ్చిన సినిమాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతోంది నేహా శెట్టి.ఇకపోతే ఇప్పటికే రూల్స్ రంజన్ సినిమాలోని సమ్మోహనుడా పాట( Sammohanuda Song ) యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే పాట వినిపించడంతో పాటు కొన్ని వందల సంఖ్యలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.అంతేకాకుండా ఈ పాటకు నేహా శెట్టి అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేసింది.
ఈ పాటలో సూపర్ సెక్సీగా కనిపించి కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది నేహా శెట్టి.బెదురులంక సినిమాలో కూడా ఆమె గ్లామర్ పాత్రలో నటించింది.
ఇకపోతే తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs oof Godavari ) నుంచి ఒక పాటను లాంచ్ చేశారు మూవీ మేకర్స్.అందులో కూడా గ్లామర్ ను ఒలుకబోస్తూ తడి అందాలతో మత్తెక్కిస్తోంది నేహా.ఒకవేళ ఈ మూడు సినిమాలు కనుక సూపర్ హిట్ కానీ హిట్ టాక్ ని తెచ్చుకున్న కూడా నేహా శెట్టి కెరియర్ గాడిలో పడినట్టే అని చెప్పవచ్చు.కాగా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల కు నేహా శెట్టి గట్టి పోటీని ఇవ్వబోతోంది అంటూ వార్తలు కూడా మొదలయ్యాయి.