ఎస్బీఐలో ఈ అకౌంట్ తెరవండి... రూ.40 లక్షల బెనిఫిట్ పొందండి?

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( State Bank Of India ) గురించి భారతీయులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఈ బ్యాంక్ తన కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా వివిధ రకాల స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ వల్ల భారీ స్థాయిలో ప్రయోజనం నేడు చేకూరుతోందనేది నిర్వివాదాంశం.

 Sbi Salary Account Holders Can Avail So Many Of Benefits Details, Sbi, Account,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ను( Salary Account ) ఓపెన్ చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చని తెలుపుతోంది.పొందే వేతనాన్ని బట్టి ప్రయోజనాల విషయంలో కూడా మార్పులు ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

విషయంలోకి వెళితే 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ వేతనం కలిగిన వారు ఎస్బీఐ నుండి “రోడియం అకౌంట్” ( Rhodium Account ) పొందవచ్చు.అదేవిధంగా ఒక్క లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల మధ్య వేతనం పొందే వాళ్లు “ప్లాటినం అకౌంట్”ను( Platinum Account ) పొందవచ్చు.అలాగే 50 వేల కంటే ఎక్కువ వేతనం వచ్చేవాళ్లు “డైమండ్ అకౌంట్”ను( Diamond Account ) పొందే అవకాశం కలదు.ఇక 25,000 నుంచి 50,000 మధ్య వేతనం వచ్చేవాళ్లు “గోల్డ్ అకౌంట్,” 20,000 రూపాయల లోపు వేతనం వచ్చేవాళ్లు సిల్వర్ అకౌంట్ ను తీసుకునే అవకాశం కలదు.

ఇక ఈ అకౌంట్ ను కలిగి ఉంటె పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (డెత్) బెనిఫిట్ కలిగే అవకాశం ఉంటుంది.

ఈ అకౌంట్లను కలిగి ఉన్నవాళ్లు లాకర్ రెంటల్ చార్జీలపై( Locker Rental Charges ) 50 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం కలదని సమాచారం.ఈ అకౌంట్ ద్వారా ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా ఉచితంగా పొందవచ్చునట.డీమ్యాట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ అకౌంట్ సర్వీసులను సైతం ఈ శాలరీ అకౌంట్ ద్వారా సులువుగా పొందవచ్చు.

ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవాళ్లు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో 2 నెలల వేతనాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.కాగా ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఓపెన్ చేసినవారు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube