ప్రభాస్ సినిమాలో అలాంటి పాత్రలో నటించాలని ఉంది: సీనియర్ నటి రాశి

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రాశి( Rashi ) ఒకరు.ఈమె ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

 Prabhas Wanted To Play Such A Role In The Film Senior Actress Rashi ,rashi, Jan-TeluguStop.com

ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి రాశి ఒకానొక సమయంలో కెరియర్ పరంగా వేసిన రాంగ్ స్టెప్ తన కెరియర్ పై కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పాలి.హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి ఈమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు కూడా కమిట్ అయ్యారు.

అలాగే పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా సందడి చేశారు.

Telugu Chiranjeevi, Prabhas, Rashi, Shoban, Tollywood-Movie

ఇలా నెగిటివ్ స్టేట్స్ ఉన్న పాత్రలలో రాశి నటించడంతో తదుపరి ఈమెకు హీరోయిన్ గాకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అవకాశాలు వచ్చాయి.ఇలా క్రమక్రమంగా అవకాశాలను కోల్పోయారు.ఇక రాశి కూడా అధిక శరీర బరువు పెరగడంతో ఈమెకు హీరోయిన్ ఛాన్సులు మిస్ అయ్యాయి.

దీంతో కాస్త ఆర్థిక ఇబ్బందులు కూడా రావడంతో ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించారు.ప్రస్తుతం బుల్లితెరపై జానకి కలగనలేదు( Janaki Kalaganaledu )అనే సీరియల్లో రాశి నటిస్తున్నారు.

మరి కొద్ది రోజులలో ఈ సీరియల్ పూర్తికానున్న నేపద్యంలో ఇందులోని సెలెబ్రెటీలు ఒక యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ చేశారు.

Telugu Chiranjeevi, Prabhas, Rashi, Shoban, Tollywood-Movie

ఇందులో భాగంగా రాశి మాట్లాడుతూ తనకు సినీ ఇండస్ట్రీలో శోభన్ బాబు ( Shoban babu ) అంటే చాలా ఇష్టం ఆ తర్వాత జనరేషన్లో చిరంజీవి(Chiranjeevi) గారు అంటే చాలా ఇష్టమైన తెలిపారు.అయితే ప్రస్తుతం ఉన్నటువంటి హీరోలలో ప్రభాస్( Prabhas ) అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.ప్రభాస్ గారితో తాను ఒకసారి మాత్రమే ఫోన్లో మాట్లాడానని తెలిపారు.అయితే తాను ఎంతో మంది హీరోలతో సినిమా చేసిన ప్రభాస్ తో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదని తెలిపారు.

ఇక తనకు కనుక ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా ఆయన పక్కన హీరోయిన్గా చేయాలని కోరుకుంటాను కానీ అమ్మగాను అత్తగానూ చేయాలని అసలు కోరుకోను అంటూ రాశి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube