ఉత్తరాంధ్ర కేంద్రం గా వారాహి యాత్ర( Varahi Yatra ) చేస్తున్న జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు.ముఖ్యంగా అక్కడ కీలక ప్రబుత్వ మరియు సహజ వనరులు అన్యాక్రాంతమైపోతున్నాయి అన్న విషయాన్ని హైలెట్ చేస్తున్న పవన్ ఆయా ప్రాంతాలకు స్వయంగా కాలినడకన బయలుదేరి వాటిపై నిజాలను నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.
నిన్నటి వరకు ఋషికొండపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసిన పవన్ అక్కడ భూమి దుర్వినియోగం అవుతున్న తీరును కొండలను తోలిచి భవనాలను నిర్మిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా బావనాలు నిర్మిస్తూ ప్రజాస్వామ్య విదా నాలను అపహాస్యం చేస్తున్నారని ప్రభుత్వ తీరుని మీడియా వేదికగా ఎండగట్టారు.

ఇప్పుడు తర్వాతి స్టెప్ గా అరుదైన ఎర్రమట్టిదిబ్బలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి అన్న ఆరోపణలపై ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.వేలాది లారీలతో ఒకప్పుడు ఇక్కడి నుంచి మట్టి తరలించకుపోయారని, జనసేన నాయకులు చేసిన ఉద్యమాలతోనే మట్టి తరలింపు ఆగిందని ఇప్పుడు దీని పక్కనే ఉన్న భూమిలోకొన్ని సంస్థలు లే-ఔట్ వేసి నిర్మాణాలు చేపడుతున్నాయని మళ్ళీ ఇక్కడి మట్టి తరలింపు మొదలవుతుందని , అరుదైన ఇలాంటి భూములను కాపాడాల్సిన అవసరం ఉందని డిమాండ్లు వస్తున్న తరుణం లో ఇక్కడకి పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రభుత్వానికి డెడ్లైన్ ఇచ్చేశారు.48 గంటల లోగా ఎర్రమట్టి దెబ్బలను సంరక్షించుకునే ఏర్పాటు చేయాలంటూ ఆయన చెప్పుకొచ్చారు.దీని చుట్టూ బఫర్ జోన్ నిర్ణయించి ఫెన్సింగ్ వేసి దీని విశిష్టతను కాపాడాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు.
ఇది విశాఖకు గర్వకారణంగా నిలిచిన పర్యాటక ప్రాంత మని కొంతమంది ప్రభుత్వ పెద్దల మద్దత్తు తో హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ పవన్ ఆరోపిస్తున్నారు.

అయితే ఈ భూములకు జియో టాగింగ్ చేసి ఈ భూమిని ఎప్పటినుంచో కాపాడుకుంటూ వస్తున్నది వైసిపి ప్రభుత్వం అంటూ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath ) పవన్ కు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందని వైజాగ్ అభివృద్ధి పై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని పవన్ మాకు బాధ్యత గుర్తు చేయాల్సిన అవసరం లేదంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు.






