మనలో చాలామందికి కుల్ఫీ( Kulfi ) అనగానే నోటిలో నీరు ఊరుతుంది.ఇలా చాలామందికి ఇష్టమైన కుల్ఫీ అనేది రకకలుగా తయారు చేస్తున్నారు.
మార్కెట్లో మనకి రకరకాల ఐస్‌క్రీం ప్లేవర్స్ ఉన్నప్పటికీ కుల్ఫీకి వున్న క్రేజ్ వేరు.అది అంతలా మధురంగా ఉంటుంది కాబట్టే దానిని చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటూ వుంటారు.
ప్రస్తుతం ఇష్టంగా తినే చల్లటి పదార్థాలలో దీనిదే అగ్రస్థానం అని చెబుతున్నారు ఆహార నిపుణులు.అంతలా తనదైన రుచితో ప్రజల మనసును చూరగొన్నాయి కుల్ఫీలు.

మరి అలాంటి కుల్ఫీ ఎలా తయారవుతుందో, ఏవిధంగా ప్యాక్ చేస్తారో మీరు ఎపుడైనా ఆలోచించారా? ప్రస్తుతం దాని తయారీకి సంబందించిన వీడియో ఒకటి ఘజియాబాద్( Ghaziabad )లోని ఓ ఫ్యాక్టరీలో ఎలా తయారువుతుందో విపులంగా చూపించింది.ఈ వీడియోని గమనిస్తే సుమారు 120 లీటర్ల పాలనను మిషన్‌లో వేసి బాగా మరిగించి అందులో పాలపొడి, పంచదార తదితరాలను వేసి చిక్కగా తయారు చేస్తున్నారు.ఆ తర్వాత 14 డిగ్రీల సెల్సియస్ చేరుకునేలా దానిని చల్లబరుస్తున్నారు.ఇంకేముంది ఆ తర్వాత దానిని వారికి నచ్చిన షేప్ లో చక్కగా ప్యాక్ చేస్తున్నారు.

ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్( Kulfi Making Video ) అవుతోంది.కాగా ఈ వీడియోని లక్షల్లో నెటిజన్లు తిలకిస్తున్నారు.ఎక్కువగా కుల్ఫీ ప్రియులే దానిని చూడడం జరుగుతుంది.దాంతో విపరీతంగా లైక్స్ చేస్తున్నారు.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు అని చెప్పుకోవచ్చు.‘కుల్ఫీ తిననిదే నాకు నిద్రరాదు’ ఒకామె కామెంట్ చేయగా, ఒక బాలుడు ‘నాకు, నా ఫ్రెండ్స్ కి ఇవంటే చాలా ఇష్టం’ అంటూ కామెంట్ చేసాడు.మరికొందరు ‘కుల్ఫీలు చేయడం ఇంత సులువని తెలియక ఇన్నాళ్లు కొనుక్కొని తిన్నాము.ఇకనుండి ఇంటిలోనే తయారు చేసుకుంటాం’ అని కామెంట్ చేయడం గమనార్హం.మీరు కూడా ఓ లుక్కేయండి.







