తెలుగులో సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టె తమిళ డైరెక్టర్స్ లలో మురగదాస్( Murugadoss ) ఒకరు ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగు లో సూపర్ హిట్ అయ్యాయి…ఆయన చేసిన గజిని( Gajini Movie ) లాంటి సినిమా అయితే ఇక్కడ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.నిజానికి ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడానికి ముఖ్య కారణం మురగదాస్ గారే అని చెప్పాలి.
ఆయన తీసిన ఈ డిఫరెంట్ సినిమా ప్రతి ప్రేక్షకుడిని మెప్పించింది అయితే ఈయన మహేష్ బాబు తో చేసిన స్పైడర్ మూవీ( Spyder Movie ) మాత్రం భారీ డిజాస్టర్ అయింది.ఇక దాంతో ప్రస్తుతం ఆయన సినిమాలకి తెలుగు లో మార్కెట్ తగ్గింది…అందుకే ఆయన ఏం సినిమాలు చేస్తున్నాడు అనేదాని మీద కూడా ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు…

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ఎవరితో అనేది కూడా తెలుగు ప్రేక్షకులకి సరిగా తెలియదు అయితే ఒకప్పుడు తమిళ్ డైరెక్టర్ లలో మణిరత్నం,( Maniratnam ) గౌతమ్ మీనన్,( Gautam Menon ) శంకర్, మురగదాస్ లాంటి డైరక్టర్ల సినిమాలు అంటే తెలుగు లో విపరీతమైన క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది… యంగ్ డైరెక్టర్స్ చేస్తున్న సినిమాలు కూడా సీనియర్ డైరెక్టర్లు చేయడం లేదు అంటే వీళ్ళ స్థాయి ఏ మేరకు పడిపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు…

అందుకే మణిరత్నం కానీ శంకర్( Director Shankar ) కానీ మురగదాస్ కానీ వీళ్ళ ముగ్గురి మార్కెట్ తెలుగు లో బాగా తగ్గింది అనే చెప్పాలి…ఇక ప్రస్తుతం తమిళ్ యంగ్ డైరెక్టర్లు అయిన లోకేష్ కనక రాజ్,( Lokesh Kanagaraj ) అట్లీ( Atlee ) సినిమాలు తెలుగు లో మంచి పాపులారిటీ ని సొంతం చేసుకుంటున్నాయి… నిజానికి ఈ యంగ్ డైరెక్టర్లు తీసే ప్రతి సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి…ఇలా తమిళ్ సీనియర్ డైరెక్టర్లకు,వాళ్ల జూనియర్ డైరెక్టర్లు అటు తమిళ్ లోను ఇటు తెలుగులోనూ షాక్ ఇస్తున్నారు…చూడాలి మరి ఈ దర్శకుల వచ్చే సినిమాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో…
.







