ఏపీలో ఎన్నికలకు ఇంకా పది నెలలు సమయం ఉన్నప్పటికి ఎలక్షన్ హడావిడి అప్పుడే మొదలైపోయింది.అధికార వైసీపీ, టీడీపీ, జనసేన ఇలా మూడు పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి.
ఈసారి అధికారం కోసం మూడు పార్టీలు కూడా గట్టిగా పోటీ పడుతున్నాయి.ముఖ్యంగా అధికార వైసీపీ ఈసారి భారీ టార్గెట్ తో ఎన్నికల బరిలో దిగబోతుంది.
గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేసిన వైసీపీ( YCP ) ఈసారి మొత్తం 175 స్థానాలను క్ర్లిన్ స్వీప్ చేయాలని లక్ష్యంతో ఉంది.అందుకు తగ్గట్టుగానే అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు.

ఇక ఈసారి బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో జగన్( YS Jagan Mohan Reddy ) ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరినీ వదులుకోవడానికి సిద్దంగా లేనని పదే పదే చెబుతూనే.మరోవైపు సర్వేల ఆధారంగానే సీట్లు కేటాయించేందుకు సిద్దమౌతున్నారు వైఎస్ జగన్.తాజాగా విజయవాడ బరిలో నిలిచే అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ బృందం.విజయవాడ పశ్చిమ నియోజికవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ తూర్పు నియోజికవర్గం నుంచి దేవినేని అవినాష్( Devineni Avinash ), విజయవాడ సెంట్రల్ మల్లాది విష్టు పేర్లను ఖరారు చేస్తూ సజ్జల రామకృష్ణరెడ్డి తాజాగా ప్రకటించారు.

ఇక ఉత్తారంద్రలోనీ అన్నీ నియోజిక వర్గాలలో కూడా అభ్యర్థులను రెడీ చేసినట్లు తెలుస్తోంది.త్వరలోనే అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించేందుకు జగన్ సిద్దమౌతున్నారట.అన్నీ అనుకున్నట్లు కురిదిరితే వచ్చే నెల రెండో వారంలో మొదటి లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి.
ఇక రెండో జాబితాను కూడా ఎంత వీలైతే అంతా త్వరగా ప్రకటించే ఆలోచనలో జగన్ ఉన్నారట.మరి జగన్ లిస్ట్ లో ఈసారి పాత వారికే అధిక ప్రదాన్యం ఉంటుందా లేదా కొత్తవారికి అవకాశం ఇవ్వబోతున్నారా అనేది చూడాలి.
మొత్తానికి ఎలక్షన్ హీట్ లో అధికార వైసీపీ దూకుడు పెంచినట్లే కనిపిస్తోంది.







