ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్( Ntr ) గ్లోబల్ వైడ్ గా పేరు సంపాదించు కున్నాడు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా ‘దేవర’.( Devara ) ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఫిక్స్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న విషయం విదితమే.

మరి ఈ సినిమా ప్రకటించినప్పుడే అంచనాలు పెరిగిపోగా హీరో హీరోయిన్ ఫస్ట్ లుక్స్ తో మరింత హైప్ పెరిగింది.ఫస్ట్ లుక్ లో తారక్ ను మాస్ హీరోగా అదిరిపోయే లుక్ లో చూపించి కొరటాల ఆకట్టు కున్నాడు.జాన్వీ కపూర్ కూడా సూపర్ లుక్ లో ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది.

సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) పుట్టిన రోజు ఆగస్టు 16న అంటే ఈ రోజే పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన బర్త్ డే కానుకగా మేకర్స్ తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.ఈ ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయగా ఆయన ఈ లుక్ లో ఊహించని మేకోవర్ లో కనిపిస్తున్నాడు.లాంగ్ హెయిర్ లో సైఫ్ ఆకట్టుకునే విధంగా ఉన్నాడు.
ఈయన పోస్టర్ చూసిన సైఫ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.సైఫ్ లుక్ ఆయన ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది. ”బైరా” గా ఈయన రోల్ ఉండబోతుంది అని చెప్పారు.మరి ఈయన ఈ విలన్ రోల్ లో ఎలా ఆకట్టు కుంటారో వేచి చూడాల్సిందే.
ఇక యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.చూడాలి మరో హిట్ తారక్ ఖాతాలో పడుతుందో లేదో.







