'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుండి ఫస్ట్ సింగిల్.. విశ్వక్, నేహా కెమిస్ట్రీ అదుర్స్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen ) ఒకరు.అనతి కాలంలోనే విశ్వక్ తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు.

 Gangs Of Godavari Suttamla Soosi Promo, Director Krishna Chaitanya, Vishwak Se-TeluguStop.com

సినిమా సినిమాకు వేరియేషన్స్ తో ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాడు.అయితే ఈ యంగ్ హీరో అప్పుడప్పుడు వివాదాలతో కూడా ఫేమస్ అయ్యాడు.

అప్పుడప్పుడు ఈయన చుట్టూ ఉండే వివాదాల కారణంగా ఈయన మరింత ఫేమస్ అయ్యాడు.ఇక విశ్వక్ సేన్ ”ధమ్కీ” సినిమా( Dhamki Movie )తో హిట్ అందుకున్న తర్వాత వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టుకున్నాడు.విశ్వక్ సేన్ ఇటీవలే తన కొత్త సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే లెవల్లో ఆకట్టుకుంది.”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే…

విశ్వక్ ను మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ లుక్ లో చూపించారు. కృష్ణ చైతన్య ( Krishna Chaitanya ) దర్శకత్వంలో చేస్తున్న తన సినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.ఈ ఫస్ట్ సింగిల్ కూడా బాగా ఆకట్టు కుంటుంది.”సుట్టంలా సూసి’ అనే లిరిక్స్ తో సాగితున్న ఈ సాంగ్ ప్రోమో తాజాగా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రిలీజ్ చేసారు…

ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చూపులతోనే బాగా చూపించారు.విశ్వక్ సేన్, నేహా శెట్టిపై తెరకెక్కిన ఈ సాంగ్ వినసొంపుగా ఉండి శ్రోతలను ఆకట్టు కుంటుంది.ఇక ఫుల్ సాంగ్ ఆగస్టు 16న రిలీజ్ చేయనున్నారు.పల్లెటూరులో జరిగే ప్రేమ కథ అని ఈ సాంగ్ ద్వారా అర్ధం అవుతుంది.ఈసారి పొలిటికల్ ను టచ్ చేస్తూ విశ్వక్ నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాను డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

https://youtu.be/2Ub05U0o8oY
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube