భారతదేశాన్ని మూడు ప్రధాన సమస్యలు పట్టి పీడిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.ఈ క్రమంలోనే అవినీతి, వారసత్వ మరియు బుజ్జగింపు రాజకీయాలను నిర్మూలించాలని తెలిపారు.
దేశంలో నెలకొన్న ఈ మూడు ప్రధాన సమస్యలను నిర్మూలిస్తేనే అభివృద్ధి సాధ్యమని మోదీ పేర్కొన్నారు.అవినీతి చెదలను సమూలంగా తుదముట్టించాలన్నారు.
అదేవిధంగా అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చిన మోదీ వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని తెలిపారు.దాంతో పాటు బుజ్జగింపు రాజకీయాలను మానుకోవాలన్నారు.
కుటుంబ పార్టీలతో దేశానికి నష్టమే తప్ప లాభముండదని స్పష్టం చేశారు.







