తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్( BRS party ) ఎన్నికల కంగారులో ఉంది.మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలో తీసుకువచ్చి దేశవ్యాప్తంగా సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన అన్ని వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతూనే, మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో ఏ విషయంపై అసంతృప్తి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ దానిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రజల్లో ఏ విషయంలోనూ ప్రభుత్వంపై అసంతృప్తి తలెత్తకుండా , మళ్ళీ తమ పార్టీకే పట్టం కట్టే విధంగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr )ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా ప్రజల నాడిని పసిగడుతూ, దానికి అనుగుణంగా నిర్ణయాలను ప్రకటిస్తున్నారు.

ప్రతిపక్షాలకు ఎక్కడా అవకాశం దక్కకుండా చూసుకుంటున్నారు.ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మరో మూడు నెలల్లోపు రాబోతోంది.దీంతో కెసిఆర్ పార్టీ శ్రేణులను మరింతగా అలర్ట్ చేస్తున్నారు.
ఇది అత్యంత క్లిష్టమైన సమయం అని సూచిస్తున్నారు.పార్టీలోని గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
సొంత పార్టీలో ప్రత్యర్థులు ఉండడం అనేది సహజమేనని, అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చి వారికి సూచనలు సలహాలు అందిస్తున్నారు.ఇప్పటి నుంచి ఎన్నికల వరకు కీలక సమయమని, జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా పొరపాటు ఉంటే సహించేది లేదని వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు .పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేల( MLAs )ను ప్రగతి భవన్ కు పిలిపించి కెసిఆర్ వార్నింగులు ఇస్తున్నారట.

నియోజకవర్గంలో గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయి, మీ గ్రాఫ్ ప్రజల్లో ఏవిధంగా ఉంది అనే విషయాలపై వారితో చర్చిస్తూ సర్వే నివేదికలు( Survey reports ) బయటపెడుతున్నారట.గత ఆరు నెలలుగా చేయించిన సర్వేలను చూపిస్తూ, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ లు ఇస్తున్నారట.నియోజకవర్గంలో ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయాన్ని ప్రశ్నిస్తూ వారిని హెచ్చరిస్తున్నారట.
ఎమ్మెల్యేలు నియోజకవర్గం లో ఎన్ని రోజులు ఉంటున్నారు ? నియోజకవర్గంలో అన్ని పనులు పూర్తి చేశారా లేదా అనేది కూడా సర్వేల ద్వారా తెలుసుకుంటూ గట్టిగానే హెచ్చరిస్తున్నారట.







