స్మార్ట్ ఫోన్ చీప్ కావడం, ఇంటర్నెట్ సదుపాయం కూడా బాగా తక్కువ ధరకే లభ్యం కావడంతో మన దేశంలో నానాటికీ సోషల్ మీడియా( Social Media ) వాడేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.దాంతో నిత్యం ఇక్కడ అనేక రకాల కంటెంట్ వీడియోలు, ఫోటోల రూపంలో అందుబాటులోకి వస్తోంది.
ఈ క్రమంలో అనేక రకాల వీడియోలు వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.ఎలాంటి వింత జరిగినా, విచిత్ర సంఘటన జరిగినా అది క్షణాల్లో నెటిజన్లకు తెలిసి పోతుంది.
అయితే అదే సోషల్ మీడియాను వాడుకొని కొందరు సెలిబ్రిటీలు అయిన దాఖలాలు కూడా మనం చూడవచ్చును.

కానీ కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే పిచ్చి కోరికతో.కొన్ని కొని పొరపాట్లు చేస్తూ వుంటారు.మరికొందరు పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటారు.
ముఖ్యంగా సెల్ఫీలు, రీల్స్ పేరుతో చాలా మంది యువత ప్రాణాలను రిస్క్‌లో పెడుతుంటారు.ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మరణాలు సంభవించడం కూడా మనం చూసాము.
అలాగే కొందరు పాములతో( Snakes ) కూడా ఆటలాడుతుంటారు.నిజానికి పాము పేరు వింటేనే మనలో అనేకమందికి దడ పుడుతుంది.
పాము చుట్టుపక్కల ఉందని తెలిస్తే చాలు.క్షణాల్లో అక్కడ్నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు.

అలాంటిది ఇక్కడ వైరల్ కాబడిన వీడియోలో ఓ వ్యక్తి ఊహించలేని ఘనకార్యం చేశాడు.అవును, కింగ్ కోబ్రా పాము( King Cobra ) తలపై ముద్దుపెట్టే ధైర్యం చేసాడు.ఈ ఫుటేజ్ చూసిన ప్రతి ఒక్కరికి గూస్బంప్స్ తెప్పిస్తుంది అంటే నమ్మి తీరాల్సిందే.ఈ వీడియో ఇన్‌స్టా ఖాతా ద్వారా అప్లోడ్ చేశారు.కాగా వీడియోలో కనిపించిన ప్రమాదకరమైన స్టంట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.వీడియోలో ఓ వ్యక్తి పాము తలపై ముద్దు పెట్టుకోవడం చూసి ప్రతి ఒక్కరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ వీడియోను ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా వీక్షించగా అనేకమంది రకరకాల కామెంట్స్ చేసారు.కొందరు క్లిప్‌పై ప్రశంసలు కురిస్తుంటే.
మరికొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.మరికొందరు ఆ వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసించారు.
ఒక వినియోగదారు “కిస్ ఆఫ్ డెత్” అని రాశారు.







