చిరంజీవి భోళా శంకర్ ( Bhola Shankar )సినిమా ప్లాప్ అయిందని ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు… ఎందుకు ఆయన్ని ఇంతలా ట్రోల్ చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలీదు అందుకే చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం లో చాలా యాక్టిిటీవ్ గా ఉంటున్నారు…చిరు కి వ్యతిరేకం గా వచ్చే కామెంట్ల మీద అతని ఫ్యాన్స్ చాలా రకాలుగా స్పందిస్తున్నారు… ఇప్పటికే నెట్లో రజినీకాంత్ కి, చిరంజీవి కి మధ్య పోలికలు పెడుతూ చిరంజీవి ని రజనీకాంత్ ను చూసి నేర్చుకోమంటు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇది చూసిన చిరంజీవి( Chiranjeevi ) ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి ముందు రజిని కాంత్ ( Rajinikanth )క్రేజ్ చాలా తక్కువ అందుకే ఆయన శివాజీ సినిమా మార్కెట్ పెరగడానికి ఆ సినిమాలో చిరు సాంగ్స్ మీద కూడా రజిని కాంత్ డాన్స్ చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు…ఇక ఇదే టైం లో తమిళ ఇండస్ట్రీ కి చెందిన కొంత మంది వేదళం సినిమా చేయాలంటే అది ఒక అజిత్ కి మాత్రమే సాధ్యం అంటూ చాలా మంది సాంబార్ బ్యాచ్ కూడా కామెంట్లు చేస్తున్నారు.ఇక దీనితో చిరంజీవి ఫ్యాన్స్ కూడా కోపానికి వస్తూ ఆ వేదలమ్ సినిమా ఏమైనా పెద్ద కళాఖండమా అన్ని తెలుగు సినిమాలను మిక్స్ చేసి చేసినట్టు గా ఉంటుంది.అలాంటి సినిమాని మళ్ళీ తీయాలి అనుకోవడమే చిరంజీవి చేసిన తప్పు అంటూ ఘాటు గా రియాక్ట్ అవుతున్నారు…

నిజానికి ముందు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )రీమేక్ చేద్దాం అనుకున్నారు కానీ ఎందుకో అది వర్క్ అవుట్ అవ్వదు అని అనుకొని ఆయన దాన్ని వదిలేశారు.నిజానికి ఈ సినిమా చిరంజీవి రీమేక్ చేసేంత గొప్ప సినిమా ఏం కాదు కానీ చాలా రోజుల తరువాత మెహర్ రమేష్ ను డైరెక్టర్ గా ఒక సినిమా ఇచ్చి నిలబెడదాం అని అనుకున్నాడు.కానీ ఆ మెహర్ రమేష్ చిరంజీవి ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకొలేక పోయాడు అందుకే అడ్డమైన వాళ్లంతా చిరు ని విమర్శిస్తున్నారు…చిరంజీవి గారిని ఎంతమంది విమర్శించిన ఆయనకి ఏం కాదు ఆయన ఒక లెజెండరీ నటుడు అంటూ ఆయన గురించి తెలిసిన చాలా మంది అంటున్నారు…








