పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Pan India Star Prabhas ) బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.ఈ సిరీస్ తర్వాత ఈయన మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో ఈయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి.
అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్ళీ మరో సినిమా హిట్ అందుకోలేక పోయాడు.
ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) కూడా దారుణంగా నిరాశ పరిచింది.ఇక ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.మరి ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మారుతి సినిమా( Director Maruthi ) కూడా ఉంది.
ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఒక యంగ్ హీరోను తీసుకోవడం కోసం మారుతి ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ ఉందని ప్రభాస్ పాత్ర గురించి తెలుసుకునే ఈ రోల్ ఫుల్ కామెడీగా ఉంటుందని అందుకే ఈ రోల్ కోసం ఒక యంగ్ హీరోను తీసుకోవాలని అనుకుంటున్నారట.నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty )ని కానీ లేదంటే బాలీవుడ్ నుండి యంగ్ హీరోను కానీ తీసుకునే ఆలోచనలో మారుతి ఉన్నట్టు తెలుస్తుంది.
మరి ఆ యంగ్ హీరో ఎవరో తెలియాల్సి ఉంది.
మారుతి సినిమాలన్నీ కామెడీ వే( Comedy )లో సాగిపోతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి.మరి ప్రభాస్ ను ఆ తరహా జోవియల్ రోల్ లో చూసి చాలా కాలం అవుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాకపోయినా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నట్టు టాక్.
కాగా రాయల్( Royal ) అనే టైటిల్ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నారు.చూడాలి ఈ ప్రాజెక్ట్ పై సమాచారం ఎప్పుడు బయటకు వస్తుందో.