ప్రభాస్ – మారుతి మూవీ క్రేజీ అప్డేట్.. మరో యంగ్ హీరో కోసం సర్చింగ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Pan India Star Prabhas ) బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.

ఈ సిరీస్ తర్వాత ఈయన మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో ఈయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి.

అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్ళీ మరో సినిమా హిట్ అందుకోలేక పోయాడు.

"""/" / ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) కూడా దారుణంగా నిరాశ పరిచింది.

ఇక ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.

మరి ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మారుతి సినిమా( Director Maruthi ) కూడా ఉంది.

ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఒక యంగ్ హీరోను తీసుకోవడం కోసం మారుతి ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ ఉందని ప్రభాస్ పాత్ర గురించి తెలుసుకునే ఈ రోల్ ఫుల్ కామెడీగా ఉంటుందని అందుకే ఈ రోల్ కోసం ఒక యంగ్ హీరోను తీసుకోవాలని అనుకుంటున్నారట.

నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty )ని కానీ లేదంటే బాలీవుడ్ నుండి యంగ్ హీరోను కానీ తీసుకునే ఆలోచనలో మారుతి ఉన్నట్టు తెలుస్తుంది.

మరి ఆ యంగ్ హీరో ఎవరో తెలియాల్సి ఉంది. """/" / మారుతి సినిమాలన్నీ కామెడీ వే( Comedy )లో సాగిపోతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి.

మరి ప్రభాస్ ను ఆ తరహా జోవియల్ రోల్ లో చూసి చాలా కాలం అవుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాకపోయినా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నట్టు టాక్.

కాగా రాయల్( Royal ) అనే టైటిల్ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నారు.

చూడాలి ఈ ప్రాజెక్ట్ పై సమాచారం ఎప్పుడు బయటకు వస్తుందో.

భజన సమయంలో డ్యాన్స్ చేస్తుండగా భక్తుడికి గుండెపోటు.. షాకింగ్ వీడియో వైరల్..??