అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా వివాదాస్పద భూములను ఆయన పరిశీలించారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర భూములను దోచేస్తుంటే మాట్లాడేవారు లేరని పేర్కొన్నారు.
రూ.13 వేల కోట్లతో అనుమతులు లేని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారని పవన్ ఆరోపించారు.ఈ దోపిడీకి స్థానిక ఎమ్మెల్యే కూడా వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.
ఉద్యోగాలు లేవు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు.దళితులకు ఇచ్చిన భూముల్లో రోడ్లు ఎలా వేస్తున్నారని ప్రశ్నించిన పవన్ రెవెన్యూ శాఖ, కలెక్టర్ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్తులను కాపాడే హక్కు మీకు లేదా అని ప్రశ్నించారు.ప్రభుత్వ ఆస్తులను అడ్డగోలుగా దోచేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.







