భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు బ్రిటీష్ రక్షణ శాఖ మంత్రి టామ్ తుగెన్‌ధాట్( Tom Tugendhat ) ఈ ఏడాది జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్ నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన ఇండియాను కొనియాడారు.
ఆహార భద్రతతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందించేందుకు భారత్‌కు జీ20 ప్రెసిడెన్సీ ముఖ్యమైనదని టామ్ అభివర్ణించారు.సరైన సమయంలో భారత్‌కు అధ్యక్ష పదవి దక్కిందన్నారు.

జీ 20 ప్రెసిడెన్సీలో భారతదేశం ఆహారం, ఇంధనం, ఎరువుల రంగాలతో సహా గ్లోబల్ సౌత్ ఆందోళనలను ఫ్లాగ్ చేస్తోందన్నారు.సమ్మిళిత ప్రపంచ వృద్ధి, సుస్ధిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీలు), వేగవంతమైన అమలు, గ్రీన్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించిందన్నారు.గతవారం కోల్‌కతాలో జరిగిన ‘‘ G20 anti-corruption ministerial’’ సమావేశంలో పాల్గొన్న టామ్.మూడు రోజుల పాటు భారత్‌లోనే వున్నారు.ఈ సందర్భంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ. న్యూఢిల్లీ లండన్‌కు ముఖ్యమైన మిత్రుడిగా అభివర్ణించారు.
ఈ క్రమంలోనే మిల్లెట్ వినియోగం, ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారతదేశం ప్రత్యేకంగా చొరవ తీసుకుందని టామ్ తుగెన్‌ధాట్ ప్రశంసించారు.ఆహార అభద్రత సమస్యను ఎదుర్కోవడానికి ఈ విధానం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్( Ukraine ) నుంచి కీలకమైన ధాన్యం ఎగుమతులను ప్రపంచ మార్కెట్లకు చేరకుండా నిరోధిస్తూ రష్యా అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని టామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.క్రెమ్లిన్ చర్య ప్రపంచవ్యాప్తంగా వున్న పేద దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.ఇది పుతిన్ తీసుకున్న క్రూరమైన నిర్ణయమని.అందువల్ల భారతదేశానికి( India ) ఈ సమయంలో జీ 20 అధ్యక్ష పదవి వుండటం చాలా కీలకమన్నారు.ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో జీ 20కి భారత్ నాయకత్వం వహిస్తోందని తుగేన్‌ధాట్ అన్నారు.







