టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిరంజీవి( Megastar Chiranjeevi ) తన సినీ కెరీర్ లో రీమేక్ సినిమాల కంటే స్ట్రెయిట్ సినిమాలతోనే ఎక్కువగా విజయాలను సొంతం చేసుకున్నారు.
అయితే చిరంజీవి గత సినిమాలైన వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్( Godfather ) బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించినా భోళా శంకర్ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.

అయితే భోళా శంకర్ మూవీ( Bhola Shankar ) ఫలితం విషయంలో అజిత్ అభిమానులు చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు.యావరేజ్ కంటెంట్ తో అజిత్ వేదాళం( Ajith Vedalam ) సినిమాలో నటించి సక్సెస్ సాధించాడని చిరంజీవి వేదాళం సినిమాను రీమేక్ చేసినా సక్సెస్ సాధించలేకపోయారని ట్రోల్స్ చేస్తున్నారు.అయితే మెగా ఫ్యాన్స్ సైతం అజిత్ ఫ్యాన్స్ విమర్శలకు ధీటుగా బదులిస్తున్నారు.
ప్రతి హీరో కెరీర్ లో హిట్ ఫ్లాపులు సర్వ సాధారణమని వాళ్లు చెబుతున్నారు.
భోళా శంకర్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పాత్రకు పూర్తిస్థాయిలో చిరంజీవి న్యాయం చేశారని ఈ విషయంలో ఆయనను ఏ మాత్రం నిందించాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అజిత్ సినిమాలు( Ajith Movies ) కూడా ఫ్లాప్ అవుతాయని ఏ హీరోకు అయినా కెరీర్ లో ఫ్లాపులు కామన్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.చిరంజీవి మంచి వ్యక్తి అని సంపాదనలో ఎక్కువ మొత్తం సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారని వాళ్లు చెబుతున్నారు.

చిరంజీవి ఎప్పుడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరని అదే సమయంలో ఫ్యాన్స్ ను కూడా వివాదాలకు దూరంగా ఉండాలని అలాంటి చిరంజీవిపై నెగిటివ్ కామెంట్లు( Negative Comments ) చేయడం సరికాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి క్రేజ్, రేంజ్, పాపులారిటీ వేరే లెవెల్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.చిరంజీవి తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.







