మెగాస్టార్ చిరంజీవికి మోకాలి సర్జరీ.. సినిమాలకు అన్ని నెలలు బ్రేక్ ఇవ్వనున్నారా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ( Bhola Shankar ) తాజాగా థియేటర్లలో విడుదలై ఫ్లాప్ నిలిచింది.ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు 40 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండనున్నాయని భోగట్టా.

 Knee Surgery To Megastar Chiranjeevi Details Here Goes Viral In Social Media,meg-TeluguStop.com

చాలా ఏరియాలలో ఈ సినిమాను నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేశారు.స్టార్ హీరో ప్రభాస్ కు త్వరలో మోకాలి సర్జరీ జరగనున్నట్టు వార్తలు వైరల్ కాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా మోకాలి సర్జరీ జరగనుందని తెలుస్తోంది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Kalyan Krishna, Knee Surgery-Movie

చిరంజీవి( Megastar Chiranjeevi ) వయస్సు ప్రస్తుతం 68 సంవత్సరాలు కాగా గత కొంతకాలంగా మోకాలి సమస్య వేధిస్తుండటంతో చిరంజీవి సర్జరీ దిశగా అడుగులు వేస్తున్నారు.చాలా రోజుల క్రితమే సర్జరీ జరగాల్సి ఉండగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల షూటింగ్ లు, ప్రమోషన్స్ కోసం చిరంజీవి చిరంజీవి ఆపరేషన్ ను పెండింగ్ లో ఉంచారని సమాచారం.ప్రస్తుతం ఇప్పటికే ప్రకటించిన సినిమాల షూటింగ్ పూర్తైన నేపథ్యంలో చిరంజీవి నిర్ణయం మారింది.

అయితే ఈ ఆపరేషన్ హైదరాబాద్ లో జరుగుతుందా? లేక విదేశాల్లో జరుగుతుందా? అనే ప్రశ్నకు జవాబు దొరకాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.చిరంజీవి దాదాపుగా రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.చిరంజీవి పుట్టినరోజు( Chiranjeevi Birthday ) కానుకగా మెగాస్టార్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు రానున్నాయి.

అయితే ఈ సినిమాల షూటింగ్ లు మాత్రం ఆలస్యం కానున్నాయి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Kalyan Krishna, Knee Surgery-Movie

2024లో కూడా చిరంజీవి రెండు ప్రాజెక్ట్( Chiranjeevi Next Movies ) లతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.ఆరు పదుల వయస్సులో కూడా రిస్కీ రోల్స్ చేయడంతో పాటు ఆ రోల్స్ ద్వారా విజయాలను అందుకునేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న చిరంజీవి గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.కళ్యాణ్ కృష్ణ, మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube