అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామి( Billionaire Vivek Ramaswamy ) తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.రిపబ్లికన్ పార్టీలో అత్యంత శక్తివంతమైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌లకు వివేక్ గట్టి పోటీనిస్తున్నారు.
అయితే సమయం గడిచేకొద్ది ఎన్నికల ప్రక్రియ మరింత క్లిష్టమవుతుంది.ఈ విషయంలో అపార అనుభవం వున్న ట్రంప్‌ను నిలువరించడం అంత సులభం కాదు.
మరి రిపబ్లికన్ పార్టీలో వివేక్ ఎలా మద్ధతు కూడగడతారన్నది ఆసక్తిగా మారింది.
ఆరు నెలల క్రితం అధ్యక్ష ఎన్నికల రేసులో దిగినప్పటికీ.
రిపబ్లికన్ ప్రైమరీలలో వివేక్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఓటర్లు రామస్వామిపై ఎక్కువగా ఆసక్తి చూపుతుండగా.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ( President Donald Trump )సాంప్రదాయవాదుల మద్ధతు బలంగా వుంది.విస్సాన్సిన్‌లోని మిల్వాకీలో చర్చకు దారి తీసే తన వ్యూహం ‘‘నిజం మాట్లాడు’’ అని వివేక్ తెలిపారు.
సత్యం అని రాసున్న బ్యానర్ చూపుతూ దానిని తన ప్రచార థీమ్‌గా మార్చుకున్నారు రామస్వామి.పెద్ద అక్షరాలలో రాసిన ఈ ఫాంట్ ట్రంప్ ప్రచార సంకేతాలను పోలి వుంది.
ఫ్లకార్డులు, టీ షర్ట్‌లు, స్టిక్కర్లపై దానిని ముద్రించారు.ప్రభుత్వం నిజం చెప్పనందుకు తాను , ఇతరులు ప్రభుత్వాన్ని నమ్మలేకపోతున్నామని రామస్వామి ఓ డిబేట్‌లో చెప్పారు.
డిజిటల్ కరెన్సీ, ఇజ్రాయెల్‌పై తన వైఖరి, అమెరికా రాజ్యాంగం, ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు, సివిల్ సర్వీస్ నియమాల వరకు వున్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన వుందన్నాడు.టెలిప్రాంప్టర్ అవసరం తనకు లేదని చెప్పడం , ప్రత్యేకమైన పాలసీల కారణంగా వివేక్ కొందరు ఓటర్ల నమ్మకాన్ని చూరగొన్నాడు.2020లో దేశం చూసిన గట్టి పోటీ కంటే, 1984లో రోనాల్డ్ రీగన్ తన ప్రత్యర్ధిని తుడిచిపెట్టినట్లే.2024లో దేశానికి అవసరమైన ఘనమైన విజయాన్ని అందించగల ఏకైక జీవోపీ అభ్యర్ధిని తానేనని రామస్వామి అన్నారు.
కొత్త దాతల మద్ధతును తాను ఆకర్షిస్తున్నానని.70 వేల మంది వ్యక్తిగత దాతలలో , చిన్న మొత్తాలు విరాళాలు ఇస్తున్న 40 శాతం మంది తొలిసారిగా రిపబ్లికన్ పార్టీకి ఇస్తున్నారని వివేక్ తెలిపారు.ఇదే సమయంలో తన ప్రత్యర్ధి డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతూ.2020లో ఆయనకు తాను గట్టి మద్ధతుదారుడినని చెప్పారు.అప్పుడప్పుడు తాము మాట్లాడుకుంటామని, కొన్నేళ్ల క్రితం కలిసి డిన్నర్ చేశామని రామస్వామి గుర్తుచేశారు .తాను అమెరికా అధ్యక్షుడినైతే ట్రంప్ తనకు సలహాదారు, గురువుగా వుంటారని వివేక్ పేర్కొన్నారు.
ఇకపోతే.‘‘ RealClearPolitics ’’ నిర్వహించిన తాజా సర్వేలో రామస్వామి 5.4 శాతం మంది ప్రజల మద్ధతుతో జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచారు.సెనేటర్ టిమ్ స్కాట్, ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి , భారత సంతతికి చందిన నిక్కీ హేలీ, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్( Nikki Haley, former Vice President Mike Pence ), న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, నార్త్ డకోటా గవర్నర్ డగ్ బర్గమ్ వంటి నేతలను వివేక్ రామస్వామి అధిగమించారు.
ఫాక్స్ న్యూస్‌లో తన ర్యాపింగ్ స్కిల్స్‌ను బయటపెట్టడం ద్వారా వివేక్ రామస్వామి పెద్ద ఎత్తున అమెరికన్ల దృష్టిని ఆకర్షించారని చెప్పవచ్చు.రాజకీయం, ప్రజాకర్షణ విధానాలను ఏకకాలంలో చేయడం ద్వారా వివేక్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
భారతీయ వలసదారులకు జన్మించారు వివేక్ రామస్వామి.ఈయన తండ్రి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజనీర్.
తల్లి డాక్టర్.ఈ దంపతులకు రామస్వామి సిన్సినాటిలో జన్మించారు.
హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలలో ఆయన చదువుకున్నారు.ఈయన సంపద విలువ 500 మిలియన్ అమెరికన్ డాలర్లు.
అమెరికాలో విజయవంతమైన బయోటెక్ వ్యవస్థాపకుడిగా వివేక్ రామస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన కంపెనీ ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఐదు ఔషధాలు సహా పలు మందులను అభివృద్ధి చేసింది.