Nelson Dilipkumar : బీస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో విజయ్ అలా అన్నారన్న నెల్సన్.. ఇబ్బందిగా అనిపించిందంటూ?

గత ఏడాది డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా బీస్ట్.( Beast movie ) ఇందులో విజయ్ దళపతి, పూజ హెగ్డే జంటగా నటించారు.కానీ ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు.అయితే ఈ సినిమా తర్వాత డైరెక్టర్ దిలీప్ కుమార్ జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇందులో రజినీకాంత్ హీరోగా నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

 Nelson Dilipkumar Opens Up On Thalapathy Vijay Reaction To Beast Reviews-TeluguStop.com

ఈ సందర్భంగా డైరెక్టర్ దిలీప్ కుమార్( Nelson Dilipkumar ) ఈ సినిమా ప్రమోషన్స్ భాగంలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొని చాలా విషయాలు పంచుకుంటున్నాడు.

అయితే తాజాగా తను ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తనకున్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడు.ఇక తమ కాంబినేషన్లో వచ్చిన బీస్ట్ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రివ్యూస్ చూసి విజయ్ తో మాట్లాడానని తెలిపాడు.దాంతో విజయ్ ఒక్కటే చెప్పాడని.మనం నిజాయితీగా సినిమా తీశామంటూ.అది కొంతమందికి నచ్చవచ్చని.

మరి కొంతమందికి నచ్చకపోవచ్చు అని.దానికి మనమేం చేస్తాం.నువ్వు ఏదైతే కథ చెప్పావో దాన్నే స్క్రీన్ పైకి తీసుకు వెళ్ళాం.

Telugu Beast, Jailer, Kollwood, Pooja Hegde, Tollywood, Vijay-Movie

భవిష్యత్తులో మరో సినిమా చేస్తే అద్భుతంగా చేద్దామని అన్నాడని తెలిపాడు.ఇక విజయ్ మాటలు తనకు ధైర్యాన్ని ఇచ్చాయని.అయితే.

సర్.మీకు నాపై కోపంగా ఉందని అడిగినప్పుడు.వెంటనే ఆయన నాకెందుకు నీపై కోపం అటువంటిది ఏమీ లేదు అని వెళ్ళిపోయాడని తెలిపాడు.అయితే అదే రోజు విజయ్( Vijay ) ఫోన్ చేసి.సినిమా పైనే మన స్నేహం ఆధారపడి ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా.

Telugu Beast, Jailer, Kollwood, Pooja Hegde, Tollywood, Vijay-Movie

సినిమా ఫలితం వల్ల కోపం వచ్చిందా అని అడగటం తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని అన్నాడని తెలిపాడు.అయితే బయట వాళ్ళు ఎన్నో మాటలంటూ ఉంటారని.ఆ ఉద్దేశంతో అందుకే అడిగానని తిరిగి సమాధానమిచ్చాడట.

ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత తాము చాలా సార్లు మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా జైలర్ సినిమా గురించి కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube