విమానంలో బాలిక ముందు ఎన్నారై డాక్టర్ హస్తప్రయోగం.. అరెస్ట్ చేసిన పోలీసులు..

మసాచుసెట్స్‌లో( Massachusetts ) స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన డాక్టర్ ఒక చెడ్డ పని చేశాడు.అతను హవాయి విమానంలో 14 ఏళ్ల బాలిక ముందు హస్తప్రయోగం చేశాడు.

 Nri Doctor Masturbates In Front Of Girl In Flight Police Arrested , Boston, In-TeluguStop.com

ఈ షాకింగ్ నేరం చేసినందుకుగాను అతడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.వివరాల్లోకి వెళితే.33 ఏళ్ల డాక్టర్ సుదీప్త మొహంతి ( Dr.Sudipta Mohanty )2022, మేలో హవాయి ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 90లో ఎక్కాడు.ఈ విమానం హోనోలులు నుంచి బోస్టన్‌కు వెళ్తోంది.అయితే ఇందులో చాలామందితోపాటు ఒక బాలిక కూడా ఎక్కింది.ఆ బాలికకు కనిపించేలా ఈ డాక్టర్ హస్తప్రయోగం చేసుకున్నాడు.

ఈ నీచపు పనిచేస్తున్నప్పుడు విమానంలోని చాలా మంది ప్రయాణికులు నిద్రపోతున్నారు.

అయితే తనకు కనిపిస్తుందని తెలిసి కూడా సదరు డాక్టర్ హస్తప్రయోగం చేసుకోవడానికి చూసి బాలిక చాలా భయపడి పోయింది.బోస్టన్‌లో తల్లిదండ్రులను కలిసిన తర్వాత ఆ బాలిక జరిగిన తతంగమంతా చెప్పింది.

తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు.అనంతరం సదరు డాక్టర్ పై కేసు ఫైల్ చేశారు.

Telugu Boston, Indian Origin, Latest, Minor, Nri-Telugu NRI

దాంతో కేస్ ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.వారి ఇన్వెస్టిగేషన్‌లో బాలిక తన తాతయ్యలతో కలిసి విమానం ఎక్కగా, అదే ఫ్లైట్‌ను డాక్టర్ సుదీప్త మొహంతి ఒక మహిళతో కలిసి ఎక్కినట్లు తేలింది.వారందరూ పక్కపక్కనే కూర్చున్నారని, విమానం ఆకాశంలో ఉన్న వేళ సదరు డాక్టర్ అసభ్యకరమైన పనిని చేయడం ప్రారంభించాడని తెలుసుకున్నారు.తన దగ్గర హస్తప్రయోగం చేసుకుంటున్న ఆ డాక్టర్‌ను చూసిన అమ్మాయికి అసహ్యం కలిగింది.

దాంతో అక్కడి నుంచి లేచిపోయి విమానంలోని మరొక వరుసలో ఖాళీగా ఉన్న సీటులో కూర్చుంది.

Telugu Boston, Indian Origin, Latest, Minor, Nri-Telugu NRI

అతని ఇంటి వద్ద ఇద్దరు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( Federal Bureau of Investigation )ఏజెంట్లు ప్రశ్నించినప్పుడు, మొహంతి అలాంటి అశ్లీల చర్యలు చేయలేదని బుకాయించాడు.అనంతరం అతడిని గురువారం బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరు పరిచారు.ఒకవేళ దోషిగా తేలితే అతనికి 90 రోజుల వరకు జైలు శిక్ష, ఒక ఏడాది పాటు పర్యవేక్షణ, 5,000 డాలర్ల వరకు జరిమానా విధించడం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube