ఉబర్ డ్రైవర్ ఐడియా అదిరిపోయింది... అతని ఆలోచనకి ప్యాసింజర్లు ఫిదా!

ఓలా, ఉబర్( Uber ) క్యాబ్స్ సర్వీసెస్ గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఈ సర్వీస్ దేశమంతా విరివిగా వినియోగంలో ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.

 The Uber Driver's Idea Is Crazy... Passengers Don't Care About His Idea! Uber,-TeluguStop.com

వీటి వలనే ప్రయాణం చాలా తేలిక అయింది.రీజనబుల్ కాస్ట్ తో ఎక్కడికంటే అక్కడికి ప్రయాణికులు సౌకర్యవంతంగా వెళుతున్నారు.

క్యాబ్ బుక్ చేసుకున్నాక క్షణాల్లో మీ ముందుంటుంది.అయితే ప్రయాణంలో ప్యాసింజర్లు సాధారణంగా బోర్ ఫీల్ కాకుండా మొబైల్ వంటివి వినియోగిస్తూ వుంటారు.

కానీ ఇటీవల ఒక ఉబర్ డ్రైవర్ టెక్నాలజీ ఉపయోగించి ప్రయాణికులకు బోర్ ఫీల్ కాకుండా చేస్తున్నారు.

దీని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవలసింది. ట్విటర్( Twitter ) వేదికగా విడుదలైన వీడియోలో ఉబర్ డ్రైవర్ ప్రయాణికుల కోసం, మరీ ముఖ్యంగా వెనుక ఉన్న వారికోసం ముందు సీటు వెనుక భాగంలో గేమ్ ఆడుకోవడానికి అనుకూలంగా ఒక స్క్రీన్ అమర్చాడు.దీంతో ఆ ట్యాక్సీ ఎక్కిన ప్యాసింజర్లకు విసుగు రాకుండా అదిరిపోయే ప్లాన్ వేసాడు.దాంతో ఈ ఐడియా చాలామందిని ఫిదా చేస్తోంది.జర్నీలో వీడియో గేమ్ ఆడుకుంటూ సమయం తెలియాకుండానే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రయాణికులు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ కాగా దీన్ని ఇప్పటి వరకు 2.1 మిలియన్ల మంది వీక్షించడం కొసమెరుపు.లైక్స్ కి అయితే లెక్కేలేదు.ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు కూడా చేస్తున్నారు.ప్రయాణికులను ఎంటర్‌టైన్ చేయడానికి ఉబర్ డ్రైవర్ మంచి ఐడియా వేసాడు అని కొంతమంది కామెంట్ చేస్తే, మరికొంతమంది ఇలాంటి డ్రైవర్ కారు ఎక్కిన వారు మరలా మరలా వారినే బుక్ చేసుకుంటారు అని కామెంట్స్ చేస్తున్నారు.నిజమే, ఈరోజుల్లో డ్రైవర్స్ ఇలా వినూత్నంగా ఆలోచిస్తే ప్రయాణికులను ఇట్టే ఆకర్శించవచ్చు.

మీరు కూడా ట్రై చేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube