భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం( Independance Day ) ఆగస్టు 15 వచ్చిందంటే.భారతీయులందరూ సంబరాలు జరుపుకుంటాం.
దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులకు నివాళులు అర్పించి వారిని స్మరించుకుంటాం.దేశంలో ఉండే స్కూళ్లు, కాలేజీలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగరవేస్తారు.
ఆరోజు చాలామంది జాతీయ జెండా( National Flag ) రంగుల్లో ఉండే దుస్తులను ధరించి తమ దేశభక్తిని చాటుతారు.

అయితే జాతీయ జెండా రంగులో ఉండే దుస్తులను ధరించాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.ఆ నియమాలను బ్రేక్ చేస్తే ఇక జైలు శిక్షే.2005లో లోక్ సభ లో( Lok Sabha ) ఈ జాతీయ జెండాకు సంబంధించి ఒక బిల్లును ఆమోదించారు.దీని ప్రకారం భారతీయ పౌరులు గౌరవప్రదంగా జాతీయ జెండా రంగులో ఉండే దుస్తులను ధరించవచ్చు.కానీ 2005లోని సెక్షన్ 2(ఇ) ప్రకారం జాతీయ జెండాను ఎవరు నడుము కింద నుంచి ధరించే దుస్తులుగా వాడరాదు.
జాతీయ జెండాను ఎలాంటి డ్రెస్ మెటీరియల్ పై ముద్రించి కూడదు అని లోక్ సభ స్పష్టం చేసింది.

చట్టం ప్రకారం నడుము కింది భాగంలో త్రివర్ణ పతాకాన్ని( Tri Color Flag ) ఎవరు ధరించకూడదు.కుషన్లు, రుమాలు, లో దుస్తుల రూపంలో ధరించకూడదు.ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
జాతీయ రంగు దుస్తులను మూడు రంగుల టీ షర్ట్, చీర, దుపట్టా, తలపాగా, చెవిపోగులు, బ్యాంగిల్స్ వంటి రూపంలో ధరించి భారత పౌరులు తమ దేశభక్తిని చాటుకోవచ్చు.కాబట్టి భారత పౌరులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని జాతీయ జెండా గౌరవాన్ని కాపాడి దేశభక్తిని చాటుకోవాలి.







