మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తన లేటెస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నిన్న ఈయన నటించిన కొత్త మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ”భోళా శంకర్”( Bhola Shankar )ను మెహర్ రమేష్ డైరెక్ట్ చేసారు.ఈ సినిమా తమిళ్ వేదాళం అనే సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కగా ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా తమన్నా హీరోయిన్ గా నటించగా.
కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరు చెల్లెలుగా నటించింది.

ముందు నుండి మెగాస్టార్ మూవీ కావడంతో భారీ హైప్ నెలకొనింది.దీంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మంచి అంచనాలతో రిలీజ్ అయ్యింది.మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాను అనిల్ సుంకర( Anil Sunkara ) ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించగా.
ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.అయితే మొదటి షో తోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమా స్ట్రైట్ సినిమా కాకపోవడంతో ఆశించిన రేంజ్ లో వసూళ్లు రాలేదు అనే చెప్పాలి.అంతేకాదు ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ మీద కొంత ప్రభావం అయితే పడింది.
ఈ సినిమా రిలీజ్ అయినా మొదటి రోజు తెలుగు స్టేట్స్ లో 33 కోట్ల గ్రాస్ వసూళ్లు( 33 Crore Gross Collections ) రాబట్టినట్టు మేకర్స్ తెలిపారు.ఈ కలెక్షన్స్ మెగాస్టార్ రేంజ్ కాదు అనే చెప్పాలి.

వరల్డ్ వైడ్ గా 79.60 కోట్ల బిజినెస్ చేసుకున్న భోళా 80 కోట్లకు పైగానే బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.అయితే మొదటి రోజు కేవలం 33 కోట్ల గ్రాస్, 18 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.ఇంకా 62 కోట్లకు పైగానే షేర్ రాబట్టాల్సి ఉంది.
మరి వీకెండ్ లో మొదటి రోజు అంత రాబట్టలేక పోయిన ఎంతో కొంత రాబడుతుంది.కానీ మిగిలిన 60 కోట్ల కలెక్షన్స్ లో ఎంత రేంజ్ లో రాబడుతుందో వేచి చూడాల్సిందే.







