సింగపూర్‌కు చెందిన భారత సంతతి శాస్త్రీయ నృత్యకారిణి రతి కార్తిగేసు( Rathi Karthigesu ) కన్నుమూశారు.ఆమె వయసు 87 సంవత్సరాలు.
సింగపూర్‌లోని( Singapore ) ప్రముఖ కుటుంబం నుంచి వచ్చి సాంప్రదాయ నృత్యంలో దిగ్గజంగా ఆమె ఎదిగారు.సింగపూర్‌లోని టాప్ అప్పీల్స్ జడ్జిలలో ఒకరైన మూటతంబి కార్తిగేసును ఆమె వివాహం చేసుకున్నారు.
ఆయన 1999లో 75 ఏళ్ల వయసులో మరణించారు.ఈ విషాదం నుంచి తేరుకోకముందే భర్త మరణించిన కొన్ని వారాల తర్వాత తన కుమార్తె షర్మిని (39)ని కోల్పోయింది.
ఈ ఇద్దరి మరణాలతో శోకసంద్రంలో మునిగిపోయి.అప్పుడప్పుడే కోలుకుంటున్న దశలో 2006లో కుమారుడు సురేష్ 48 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోవడం రతికి శరాఘాతంలా తగిలింది.

రతి కార్తిగేసు. మాజీ సీనియర్ మంత్రి, ప్రస్తుతం సింగపూర్ అధ్యక్ష బరిలో నిలిచిన థర్మన్ షణ్ముగరత్నం అత్త.( Tharman Shanmugaratnam ) ఆమె సోదరుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు పి సెల్వదురై ‘‘ది సండే టైమ్స్’’కి 2001లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.రతి కార్తిగేసు గొప్పతనాన్ని వివరించారు.
సాంప్రదాయ భారతీయ కళలను( Indian Culture ) ప్రోత్సహించడంలో ఆమె ఎప్పుడూ ముందుండేవారని సెల్వదురై ప్రశంసించారు.అంతేకాదు.
సింగపూర్‌లో భారతీయ లలిత కళల స్థాపన, ప్రోత్సహం విషయంలో రతి కార్తిగేసును మార్గదర్శకురాలిగా పరిగణిస్తారు.

సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (సిఫాస్) ఆమె మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.కార్తిగేసు కొంతకాలం పాటు సొసైటీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.ఆమె భర్త కూడా ఈ సొసైటీ అధ్యక్షుడిగా సేవలందించారు.
సింగపూర్‌లోని శ్రుతిలయ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ డైరెక్టర్ గాయత్రీ శ్రీరామ్( Gayatri Sriram ) మాట్లాడుతూ.తాను 1995లో కార్తిగేసును కలిశానని, ఇద్దరికీ భరతనాట్యం( Bharatanatyam ) పట్ల మక్కువ వుండటంతో తమ మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయన్నారు.
సింగపూర్‌లోని భారతీయ నృత్య సమాజానికి ఆమె అందించిన సహకారం అసాధారణమైనదని గాయత్రీ కొనియాడారు.రతీ మరణం పట్ల సింగపూర్‌లోని భారతీయ కమ్యూనిటీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.







