హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అఖిలపక్షం నిరసనకు దిగింది.ఈ మేరకు ప్రతిపక్ష నేతల నిరసనల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఈ క్రమంలోనే ప్రొ.కోదండం రాంతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లను పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేశారు.అదేవిధంగా గన్ పార్క్ వద్దకు రాకుండా ఆంక్షలు విధించిన పోలీసులు గన్ పార్క్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.







