జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కమెడియన్ రాకింగ్ రాకేష్( Rocking Rakesh ) .ఇక ఈయన టీం లోనే జోర్దార్ సుజాత ( Jordar Sujatha ) కూడా కలిసి పలు స్కిట్లలో సందడి చేసేవారు.
ఇలా వీరిద్దరూ ఒకే టీంలో పని చేయడంతో ఇద్దరు మధ్య కూడా ప్రేమ చిగురించింది.అయితే వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టకుండా ఇద్దరు కలిసి ఒకే స్కిట్ లో చేయడమే కాకుండా ఎక్కడికి వెళ్లినా ఇద్దరు జంటగా వెళ్లేవారు అయితే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని అందరూ భావించారు.
కానీ తమ మధ్య ప్రేమ ఉందంటూ అందరికి షాక్ ఇచ్చారు.ఇలా జబర్దస్త్ వేదిక పైన వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ప్రకటించడమే కాకుండా పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా వైవాహిక జీవితంలో సుజాత రాకింగ్ రాకేష్ ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇకపోతే సుజాత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.ఇకపోతే తాజాగా ఓ బుల్లితెర కార్యక్రమంలో భాగంగా కొన్ని రీల్ జంటలు,రియల్ జంటలు పాల్గొని సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా రాకేష్ తన కోసం చేసిన పని గురించి మాట్లాడుతూ ఈమె ఎమోషనల్ అయ్యారు.

సుజాత మాట్లాడుతూ రాకేష్ గారికి ఇంజక్షన్స్ ( Injections )అంటే చాలా భయం.ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోయినా టాబ్లెట్స్ తోనే నయం చేసుకుంటారు.కానీ ఇంజక్షన్స్ అసలు తీసుకోరు.
ఇలా సూది అంటే అంత భయం ఉన్నటువంటి ఆయన నా కోసం పచ్చబొట్టు( Tatoo ) వేయించుకున్నారని అలా పచ్చబొట్టు వేయించుకున్నటువంటి సమయంలో ఎంతో నొప్పి ఉన్నప్పటికీ నాకోసం ఆ నొప్పిని భరించారు అంటూ సుజాత ఎమోషనల్ అవుతూ ఈ విషయాన్ని తెలియజేశారు.ఆరోగ్యం కోసం కూడా సూది వేయించుకొని రాకేష్ తన భార్య కోసం ఇలా పచ్చబొట్టు వేయించుకున్నారు అంటే సుజాత పట్ల తనకు ఎంత ప్రేమ ఉందో ఈమె మాటల్లోనే అర్థమవుతుంది.
ఇక వీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.