చంద్రుని పైకి రష్యన్ లూనా 25 మిషన్... ఇండియన్ చంద్రయాన్ 3 పరిస్థితి?

తాజాగా ఇండియా చంద్రయాన్ 3( Chandrayaan 3 ) ప్రయోగం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.దీనిపైన అనేక ఆశలు వున్నాయి.

 Russian Luna 25 Mission To The Moon Status Of Indian Chandrayaan 3, Russia, Moon-TeluguStop.com

జాబిల్లి గుట్టుమట్లు తెలుసుకునేందుకు దీనిద్వారా ఇంకా మార్గం సులువు అవుతోందని ఇస్రో సంబరపడుతోంది.ఈ క్రమంలోనే జాతి మొత్తం చంద్రుడి కక్ష్యలో దిగిన చంద్రయాన్ 3 అప్డేట్స్ ను తీసుకునేందుకు ఎప్పటికప్పుడు ఆసక్తి ప్రదర్శిస్తోంది.

ఇక తాజా విషయానికొస్తే ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య రష్యా తన గగన తలం మీద నుంచి రాకెట్ ప్రయోగం చేపట్టి, ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది.అవును, 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన “లూనా 25”( Luna 25 ) ను విజయవంతంగా చంద్రుడి మీదికి పంపింది.

అది మన ప్రయోగం కంటే ముందు జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువమే లక్ష్యంగా చంద్రయాన్ 3 ని పంపితే.రష్యా కూడా చంద్రుడి దక్షిణ ధ్రువాన్నే లక్ష్యంగా చేసుకొని ప్రయోగం చేయడం కొసమెరుపు.దీనికోసం “లూనా_25” అనే స్పేస్ క్రాఫ్ట్ ను రష్యా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు “వాస్టోకీ కాస్మో డ్రామ్”( Vastoki Cosmo Dram ) అనే అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది.

అవును, “వాస్టోకీ కాస్మో డ్రామ్” నుంచి నిప్పులు కక్కుతూ “లూనా_25” నింగిలోకి దూసుకెళ్లింది.ఇది కేవలం ఐదు రోజుల్లోనే చంద్రుడి కక్ష్యలోకి చేరుతుందని సమాచారం.

ఆ తరువాత చంద్రుడి దక్షిణ ధ్రువం పై దిగేందుకు అనువైన ప్రదేశం కోసం కొన్ని రోజులపాటు (3 లేదా7) అన్వేషణ కొనసాగిస్తూ అనువైన చోటు దొరికినపుడు చంద్రుడి మీద దిగుతుంది.అక్కడ దిగిన అనంతరం చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు రష్యా( Russia ) అంతరిక్ష కేంద్రానికి చేరవేరుస్తుందన్నమాట.చంద్రుడి మీద నీటి ఆనవాళ్లు ఉన్నాయని ఇస్రో గతంలో ప్రపంచానికి వెల్లడించిన నేపథ్యంలో.వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు పలు రాకెట్లను చంద్రుడి మీదికి పంపడానికి ఉత్సాహం చూపించాయి.

ఈ నేపథ్యంలో చాలా కొన్ని రాకెట్లను పంపించాయి కూడా.అయితే ఆ ప్రయోగాల్లో ఆదేశాలు ఆశించినంత ప్రయోజనం కనిపించలేదు.దాంతోనే తాజాగా ప్రయోగాలు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube