రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన అడ్మిషన్స్ పోస్టర్స్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, నాప్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బుధవారం స్థానిక జూనియర్ కళాశాలలో నూతన డిగ్రీ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో 2023, 24 సంవత్సరానికి నూతన అడ్మిషన్స్ ప్రారంభం జరుగుతున్నాయని విద్యార్థులు అడ్మిషన్స్ పొందాలని అన్నారు.
బి ఏ, బీఎస్సీ, బి జెడ్ సి, సి ఎ గ్రూప్ లు ప్రారంభం అవుతున్నాయని ఒక్కో కొర్సులో 60 మంది విద్యార్థులను తీసుకుంటారని తెలిపారు.అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ విద్యార్థులకు మాట్లాడడం నేర్పాలని స్కిల్స్ డెవలప్మెంట్ జరగాలని ప్రిన్సిపాల్ కు సూచించారు.
అమెరికా తరహా కొలంబియా అనే కోర్సు ప్రవేశపెట్టే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని కేరళ రాష్ట్రం విద్యారంగంలో ముందు ఉందని మన తెలంగాణ రాష్ట్రం కూడా విద్యారంగం ముందుకు పోవాలని ఆయన ఆకాంక్షించారు.విద్యార్థులు నైపుణ్యత, స్కిల్స్ డెవలప్మెంట్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో నాప్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జిల్లా సీనియర్ నాయకులు చీటీ నర్సింగారావు, జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, మాజీ ఎంపీపీ ఎల్లిసాని మోహన్ కుమార్, జిల్లా సీనియర్ నాయకుడు అందే సుభాష్, పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి , ఎనగందుల అనసూయ, మండల మహిళా అధ్యక్షురాలు అప్సర ఉన్నిసా, మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.