శరీర అధిక బరువును అదుపులో ఉంచుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు ఇవే..!

మన శరీరం యొక్క బరువు మన వయస్సు మరియు ఎత్తుకు సరిపడే విధంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలము.నిజానికి అధిక బరువు అనేది అనేక రకాల అనారోగ్య సమస్యలకు మూల కారణమని చాలామందికి తెలుసు.

 These Are The Tips To Keep Body Weight Under Control..!,junk Food , Weight Loss-TeluguStop.com

కొంత మంది బరువు పెరుగుతున్నప్పటికీ మేము ఆరోగ్యంగానే ఉన్నాము అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు.బరువు పెరగడం( Weight Gain ) అనేది వారి అలవాట్ల వల్ల అనీ నిపుణులు చెబుతున్నారు.

బరువు పెరగడానికి ప్రధాన కారణం చాలామంది అతిగా తింటే బరువు పెరిగేస్తున్నాం అని తినకుండా ఉంటారు.కానీ తినకుండా ఉంటే ఆకలి వేస్తుంది కదా ఆ సమయంలో ఏదో ఒక జంక్ ఫుడ్ కొద్దిగే కదా అని తినేస్తారు.

అలాగే జంక్ ఫుడ్స్( Junk Food ) వల్ల అదిక బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.జంక్ ఫుడ్ అనేది కచ్చితంగా శరీరంపై ప్రభావం చూపుతుంది.కాబట్టి జంక్ ఫుడ్ కు దూరంగా ఉన్నప్పుడే అధిక బరువు పెరగకుండా ఉంటారు.

నిద్ర సరిగ్గా లేకుంటే కూడా అధిక బరువు పెరుగుతారు.ఈ విషయం మన నిపుణులు కొంతమందిని తీసుకుని అధ్యయనం చేసి మరి నిర్థారించారు.

మధ్య వయసులో ఉన్నవారు కనీసం రోజుకు 7 నుంచి 8 గంటలు అయినా నిద్ర పొకపోతే శరీరంలో మెటబాలిజం సరిగా పనిచేయదు.సరిగ్గా నిద్రలేని వారికి మెటబాలిజం పని చేయకుంటే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే సరైన సమయానికి నిద్రపోయి, ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు బాగా పని చేసి జీర్ణ వ్యవస్థ( Digestive system ) కూడా సరిగ్గా పని చేయడం వల్ల అధిక బరువు పెరగకుండా ఉంటారు.సరైన సమయానికి ఆహారం తీసుకోకుంటే శరీరం యొక్క మెటబాలిజం దెబ్బ తిని బరువు పెరిగే అవకాశం ఉంటుంది.ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అన్ని సమయానికి, అలాగే మితంగా తీసుకోవడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube