ఎవరైనా సరే సెలబ్రిటీలు( Celebrities ) ఉన్నట్టుండి దూకుడు తగ్గించడంతో అందరికీ అనుమానాలు పెరుగుతూ ఉంటాయి.ఎప్పుడూ ఒక రేంజ్ లో హడావుడి చేసే సెలెబ్రెటీలు ఒకేసారి సైలెంట్ అయితే చాలు దాని వెనుక ఏదో ఒక గట్టి కారణం ఉండే ఉంటుంది.
అయితే ఇటువంటిది ఈమధ్య అషు రెడ్డికి బాగా ఎదురవుతుంది.ఈమధ్య తను బాగా సైలెంట్ అవ్వడంతో జనాలు ఈమె స్పీడ్ తగ్గడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారు.
అయితే దానికి ఒక కారణం ఉందని రీసెంట్ గానే బయటపడింది.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సోషల్ మీడియాతో స్టార్ గా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్న స్టార్ అషు రెడ్డి( Ashu Reddy ).ఇక ఈ ముద్దుగుమ్మ గురించి సోషల్ మీడియా ప్రియులకు, బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం అని చెప్పాలి.గతం లో బుల్లితెర ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలుగుంది అషు.అతి తక్కువ సమయంలో మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.పైగా రెండుసార్లు బిగ్ బాస్ షో లో అవకాశం అందుకొని హౌస్ లో బాగా రచ్చ చేసి మరింత దృష్టి పెంచుకుంది.
అషు డబ్స్మాష్ వీడియోలతో తొలిసారిగా అందరి దృష్టిలో పడింది.
చూడటానికి సమంతలా కనిపించటంతో ఆ గుర్తింపుతోనే ఇప్పుడు ఇక్కడికి చేరుకుంది.ఇక సినిమాతోనే అవకాశం అందుకొని ఆ తర్వాత వెండితెరకు గుడ్ బై చెప్పేసింది.
బిగ్ బాస్ షో( Bigg Boss ) తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.గతంలో రాహుల్ సిప్లిగంజ్( Rahul Sipligunj ) తో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తర్వాత బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం లేకపోయింది.
ఆ తర్వాత యాంకర్ రవి( Anchor Ravi ) తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.
ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ మొదలు పెట్టింది.
ఆమధ్య ఈమె చేసే వరుస ఫోటోషూట్ ల గురించి రోజు ఏదో ఒక వార్త వచ్చేది.

కానీ గత కొన్ని రోజుల నుండి ఈమెను పట్టించుకునే వాళ్ళు కూడా లేరు.పైగా తను కూడా అందాల ఆరబోత చాలా తక్కువగా చేస్తుంది.గ్యాప్ ఇచ్చి ఫోటో షూట్ లు చేయించుకుంటుంది.
అయినా కూడా ఈమెను జనాలు పట్టించుకోవడం లేరు.దానికి కారణం ఏదో కాదు హీరోయిన్ శ్రీ లీల అని చెప్పాలి.
ప్రస్తుతం కుర్రాళ్ళ క్రష్ గా శ్రీ లీల ఉంది.ప్రతి ఒక్కరు శ్రీ లీల( Sreeleela ) వైపే దృష్టి పెడుతున్నారు.
తను గ్లామర్ షో చేయకున్నా కూడా.తనను చూడటానికి బాగా ఇష్టపడుతున్నారు.
దీంతో అషు రెడ్డి ని ఎవరు పట్టించుకోవడం లేదు.అందుకే తను కూడా దూకుడు మొత్తం తగ్గించేసింది.







