క్లిన్ కార కొణిదెల( Klin kaara Konidela ) ప్రస్తుతం ఈ మెగా మనవరాలు గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan ), ఉపాసన( Upasana ) దంపతులకు పెళ్లయిన 11 సంవత్సరాలకు చిన్నారి జన్మించడంతో ఈమెకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చిన సోషల్ మీడియాలో క్షణాల వైరల్ అవుతుంది.
ఇక ఈ చిన్నారి జూన్ 20వ తేదీ జన్మించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఇప్పటివరకు మెగా మనవరాలు ఎలా ఉందనే విషయాన్ని మాత్రం బయటకు తెలియజేయలేదు.
ఇక మెగా మనవరాలు ఎలా ఉంటుందో చూడాలన్న ఆత్రుత ప్రతి ఒక్క అభిమానిలోను ఉంది.ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులుగా మారడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మెగా కుటుంబ సభ్యులు చిన్నారి కోసం ప్రత్యేకంగా కానుకలను పంపిస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్,శర్వానంద్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు అందరూ కూడా చిన్నారి కోసం ప్రత్యేకమైన కానుకలు పంపించారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తాజాగా మెగా మనవరాలు కోసం మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి కానుక ఇచ్చారనే విషయం గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.
మెగా మనవరాలు జన్మించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన కోసం ఓ ప్రత్యేకమైన కానుక ఇచ్చారట.మెగా కుటుంబం మొత్తం ఎంతగానో విశ్వసించే ఆంజనేయ స్వామి ప్రతిరూపం ఉన్నటువంటి ఒక బంగారు డాలర్ ( gold dollar ) తమ మనవరాలకి కానుకగా ఇచ్చారని తెలుస్తుంది.మెగా కుటుంబం ఆంజనేయ స్వామి భక్తులు అనే విషయం మనకు తెలిసిందే.అందుకే ఆ దేవుడు చల్లని కృప తమ మనవరాలు పై ఉండాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి క్లిన్ కారా కోసం బంగారు ఆంజనేయస్వామి డాలర్ కానుకగా ఇచ్చారని తెలుస్తోంది.