ప్రజా గాయకుడు విప్లవ వీరుడు, పాటల తూట,చైతన్య బహుట, విఠల్ రావు (Vital rao)అలియాస్ గద్దర్(Gaddar) అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.మాటలనే పాటలుగా కైకట్టి ఎంతోమంది ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజా గాయకుడు.
పేద ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై పోరాడిన గద్దర్ మరణించడం ఈ సమాజానికి తీరని లోటు.సమాజంలో మార్పు కోసం ఆయుధం పట్టాడు.
ఎన్నో పాటలు రాసి ఎంతోమందిలో చైతన్యం కలిగించి ముందుకు సాగిన సంగీత సమరశీలి గద్దర్.
ఇక తెలంగాణ(Telangana) ప్రత్యేక ఉద్యమంలో తన పాట ఒక తూటాలా పేలింది.
అలాంటి గద్దర్ 1949 మెదక్ జిల్లా తూప్రాన్ లో జన్మించారు.తన శరీరంలో బుల్లెట్లు ఉన్నా కానీ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల కోసం ఎప్పుడూ కూడా పోరాడే గద్దర్ ఆగస్టు 6వ తేదీ 2023న తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణ వార్త విన్న రెండు తెలుగు రాష్ట్రాలు షాక్ అయిపోయాయి.ఎంతోమంది కళాకారులు, మేధావులు ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, ఆయనకు నివాళులర్పించారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది.అలాంటి గద్దర్ ఈ మధ్యకాలంలోనే తెలంగాణ ప్రజా ఫంట్(Telanagana praja front) అనే పార్టీని పెట్టారు.ఈ పార్టీ ద్వారా తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు.కానీ ఆయన కోరిక తీరకముందే మరణించారు.మరి అలాంటి గద్దర్ కోరికను తీర్చడం కొరకు ఆ పార్టీ గద్దర్ కొడుకు సూర్యకు(Surya) టికెట్ ఇవ్వాలనుకుంటుందట.రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా ఆయన టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని ఆ పార్టీ భావిస్తుందట.
ఇంతకీ ఆ పార్టీ ఏంటయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ.

ఈ మధ్యకాలంలోనే ఖమ్మం సభా వేదికగా గద్దర్ రాహుల్ గాంధీని(Rahul gandhi) కలిసి ఆప్యాయంగా మాట్లాడి ముద్దు కూడా పెట్టారు.అలాంటి ఆయన ఇంతలోనే మరణించడంతో రాహుల్ గాంధీ కూడా స్పందించారట.అంతటి మహానుభావుడి కోరిక మేరకు ఆయన కొడుకు పార్టీ నుంచి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
అయితే ఆయనకు టికెట్టు ఏ ప్రాంతం నుంచి ఇస్తారనేది సస్పెన్స్ గా ఉంది.ఏది ఏమైనా గద్దర్ కొడుకుకు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది అని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.