గృహలక్ష్మి పథకం గడువు ఆగస్ట్‌ 31 వరకు పొడిగించాలి.. సీపీఎం పార్టీ డిమాండ్

గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకొనే తుది గడువును ఆగస్ట్‌ 31 దాకా పొడిగించాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కేవలం మూడు రోజులే గడువు నిర్ణయించటం వలన ఎక్కువ మంది పేదలు అవకాశాన్ని కోల్పోతారని, నిజంగా ప్రజలకు మేలు చేయదలచుకుంటే మూడు రోజుల గడువు ఏమిటని ప్రశ్నించారు.

 The Deadline Of Grilahakshmi Scheme Should Be Extended Cpm Party Demand, Grila-TeluguStop.com

ప్రభుత్వం చెప్పినట్లు దరఖాస్తుకు కావాల్సిన గుర్తింపు కార్డులన్నీ సమర్పించాలంటే సాధ్యం కాదన్నారు.

మహిళ పేరుతో స్థలం వుంటేనే పథకం వర్తిస్తుందనే నిబంధన సరికాదన్నారు.

అర్హులైన పేదలకు స్థలం ఎవరి పేరుతో వున్నా పథకాన్ని వర్తింప చేయాలని లేదంటే భర్త పేరుతో వున్న స్థలాన్ని భార్య పేరుతో మార్చుకొనే అవకాశం అయినా యివ్వాలన్నారు.దరఖాస్తులు స్వీకరించటానికి ప్రత్యేక కౌంటర్లు, యంత్రాంగం ఉండాలన్నారు.

ఆదాయ,కుల ధృవీకరణ పత్రాలు యివ్వటానికి తహశీల్దార్‌ కార్యాలయాలలో ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube