జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు గానూ తనదైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.ప్రతి రాష్ట్రంలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే కేసీఆర్ రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు.ఈ క్రమంలోనే సాంగ్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
అనంతరం పార్టీలోకి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్ లు తెలంగాణ భవన్ వేదికగా గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.







