ఏడు ఏళ్ల క్రితం పవన్‌ భోళా శంకర్ ను మొదలు పెట్టాడు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్( Bhola shankar ) సినిమా తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.హీరోయిన్‌ గా తమన్నా నటించగా మెహర్‌ రమేష్ దర్శకత్వం లో సినిమా రూపొందిన విషయం తెల్సిందే.

 Chiranjeevi Bhola Shankar Movie Pawan Kalyan Started 7 Years Back , Vedalam, Chi-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఈ రీమేక్ విషయంలో చాలా చర్చలు జరిగాయి.మొదట ఆసక్తి చూపించలేదు.

కానీ నిర్మాత మరియు దర్శకుడు సినిమా రీమేక్ కోసం కథ చెప్పి ఒప్పించారు అన్నాడు.అయితే ఈ సినిమా ను దాదాపు ఏడు సంవత్సరాల క్రితం ఏ ఎం రత్నం నిర్మాణం లో పవన్‌ కళ్యాణ్ చేసేందుకు సిద్ధం అయ్యాడు.

ఆ సమయంలో స్క్రిప్ట్‌ వర్క్ జరిగింది.అంతే కాకుండా అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.

కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను ముందుకు తీసుకు వెళ్లలేక పోయారు.పవన్ కళ్యాణ్‌ ఇతర ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉండటం వల్ల వేదాలం రీమేక్‌ ను చేయలేక పోయారు.వేదాళం కథతో ఇప్పుడు చిరంజీవి సినిమాను చేస్తున్నాడు.భోళా శంకర్‌ అనే టైటిల్‌ తో ఈ సినిమాను రూపొందుతున్న విషయం తెల్సిందే.రీమేక్ అయినా కూడా చాలా మార్పులు చేసి తెలుగు లో రూపొందించారు.

గతంలో పవన్‌ కళ్యాణ్ చేయాలి అనుకున్న సినిమా ను ఇప్పుడు మెగాస్టార్‌ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

ఈ రీమేక్ కు పవన్‌ కళ్యాణ్‌ కంటే చిరంజీవి అయితే బాగుంటుందని చాలా మంది భావించారట.అందుకే చిరంజీవి( Chiranjeevi ) ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భోళా శంకర్‌ సినిమా ను ఒక వేళ పవన్‌ కళ్యాణ్ అప్పట్లోనే చేసి ఉంటే ఎలా ఉండేదో కదా అంటూ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube